‘సిరీ’ పై కన్నేసిన ఆ ముగ్గురు?

By Super
|
LG launches Quick Voice, a voice assistant for Optimus phones


ఆపిల్, సామ్‌సంగ్‌ల తరహాలో ఎల్‌జీ తన ఆప్టిమస్ సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్‌ను డిజైన్ చేసింది. పేరు ‘క్విక్ వాయిస్’. దింతో ఎల్‌జీ రూపొందించిన ‘క్విక్ వాయిస్’ ఇంటెలిజెంట్ వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, ఆపిల్ డిజైన్ చేసిన వాయిస్ కమాండ్ అప్లికేషన్ ‘సిరి’కి ప్రధాన పోటీదారుగా నిలవనుంది. ఇటీవల సామ్‌సంగ్ ఆపిల్‌కు పోటీగా ‘ఎస్ వాయిస్’పేరుతో సరికొత్త వాయిస్ అప్లికేషన్‌‌ను గెలాక్సీ ఎస్‌3లో నిక్షిప్తం చేసింది.

వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్‌లకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపధ్యంలో గుగూల్, ఆపిల్ ను అధిగమించడమే లక్ష్యంగా ‘ప్రాజెక్ట్ మజీల్’ పేరుతో న్యాచురుల్ ప్రాసెసింగ్ వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఎల్‌జీ ‘క్విక్ వాయిస్’ ఫీచర్‌ను ఒదిగి ఉన్న ఆప్టిమస్ LTE2, ఆప్టిమస్ Vu స్మార్ట్‌ఫోన్‌‌లు జూన్, జూలై మాసాల్లో విడుదల కానున్నాయి. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ సౌలభ్యతతో ఎల్‌జీ ఆప్టిమస్ యూజర్లు వాయిస్ కమాండ్ ఆధారితంగా వివిధ అప్లికేషన్‌లను రన్ చేసుకోవచ్చు.

మైక్రోమ్యాక్స్ అయిషా!!

దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్రాండ్ తాజాగా డిజైన్ చేసిన డ్యూయల్ సిమ్ ఫోన్ ‘ఏ50 ఆకా నింజా’ (A50 aka Ninja) సరికొత్త ఫీచర్లతో వేడి పుట్టిస్తుంది. ఆండ్రాయిడ్ వోఎస్ ఆధారితంగా పనిచేసే ఈ ఫోన్లో Aisha అనే వాయిస్ కమాండ్ అప్లికేషన్ ను నిక్షిప్తం చేశారు. సిరీ వాయిస్ కమాండ్ అప్లికేషన్ తరహాలో ఈ ఫీచర్ పని చేస్తుంది. ఈ సౌలభ్యతతో మీ మాటలు ఆధారితంగా ఫోన్ స్పందించడం మొదలుపెడుంది.

Aisha అంటే ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ స్పీచ్ హ్యాండ్ సెట్ అసిస్టెంట్’. ఈ అప్లేకేషన్ పదాలను చర్యలలోకి అనువదించగలదు. అంటే నోటీ ద్వారా మీరు ఇచ్చే కమాండ్‌లకు ఈ అప్లికేషన్ ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు: ‘What is the weather in vijayawada’ అని మీరు వాయిస్ కమాండ్ ఇస్తే టక్కన ‘The weather will be cloudy and rainy’అని సమాధానం ఇస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X