అల్ట్రా డెఫినిషన్ 3డీ టీవీ..ఎంత పెద్దదో!

Posted By: Staff

అల్ట్రా డెఫినిషన్ 3డీ టీవీ..ఎంత పెద్దదో!

యూజర్ ఫ్రెండ్లీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ ప్రపంచపు తొలి ‘4కె అల్ట్రా డెఫినిషిన్ 3డీ టీవీ’ని ఆవిష్కరించింది. ఈ టెలివిజన్ స్ర్కీన్ పరిమాణం 84 అంగుళాలు. స్ర్కీన్ రిసల్యూషన్ 4096 x 2160పిక్సల్స్ అంటే ప్రస్తుత హైడెఫినిషన్ మోడళ్లతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం. సెప్టంబర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ టీవీలో నిక్షిప్తం చేసిన 4కె అల్ట్రాడెఫినిషన్ టెక్నాలజీ యూజర్‌కు అత్యుత్తమ హోమ్ వ్యూవింగ్ అనుభూతులను చేరువచేస్తుంది. ఈ ఆడ్వాన్సుడ్ టెక్నాలజీ టెలివిజన్ రంగంలో ఆధునిక ఒరవడికి నాందిపలకనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎల్‌జీ తరహాలోనే సోనీ, తోషిబాలు 4కె అల్ట్రాడెఫినిషన్ టీవీలను 2012 ఐఎఫ్ఏ కార్యక్రమంలో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting