Just In
Don't Miss
- Movies
బాలయ్య కొత్త చిత్రానికి అల్లు అర్జున్ టైటిల్.. బడా ప్రొడ్యూసర్‌తో బోయపాటి చర్చలు.!
- News
భారతీయ సంస్కృతిలో 64 కళలు.. అవేమిటో తెలుసా?
- Finance
కన్ఫ్యూజన్: FASTag ఉంది కానీ.. టోల్ గేట్ల వద్ద బారులుతీరిన వాహనాలు
- Lifestyle
సోమవారం మీ రాశిఫలాలు 16-12-2019
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
LG నుంచి ట్రిపుల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్..
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం LG స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో సంచలనానికి సిద్ధమైంది. వచ్చే నెలలో యూరోప్ లో జగరనున్న అతిపెద్ద టెక్ ఈవెంట్ IFA 2019లో ఎల్జీ triple screen స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. బెర్లిన్‌లో సెప్టెంబర్ 6 ఉదయం 10గంటల నుంచి సెప్టెంబర్ 11 వరకు IFA 2019 ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్లో LG కంపెనీ తమ కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్లో మూడు స్క్రీన్లు ఉన్నాయంటూ ఓ వీడియో టీజర్ కూడా కంపెనీ షేర్ చేసింది. 20 సెకన్ల నిడివిగల ఈ వీడియోను LG మొబైల్ గ్లోబల్ అకౌంట్ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడై ట్రెండ్ అవుతోంది.

రిలీజ్ డేట్, టైమ్
ఈ వీడియోలో చిన్న స్మార్ట్ ఫోన్ బేసిడ్ వీడియో గేమ్ క్యారెక్టర్ ఒక స్క్రీన్ నుంచి రెండో స్క్రీన్ కు మూవ్ కావడం అక్కడి నుంచి మూడో స్క్రీన్ మారడం ఎంతో ఎట్రాక్టీవ్‌గా ఉంది. ఫోల్డబుల్ డిస్ ప్లే ఫోన్ మాదిరిగా మూడు స్క్రీన్ల స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయనుంది. స్మాల్ స్క్రీన్ ఇష్టపడే యూజర్లను ఆకట్టుకునేలా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్, టైమ్ ను కంపెనీ ఇంకా బహిర్గతం చేయాల్సి ఉంది.

V-సిరీస్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో
ఈ కొత్త టీజర్ వీడియో చూస్తుంటే కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG తన తదుపరి V-సిరీస్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో LG V60 ThinQ లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎల్ జీ 2019 ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో LG V50 ThinQ మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ లో పోగో పిన్స్ సెటప్ తో పాటు డ్యుయల్ స్క్రీన్ ఎఫెక్ట్ అందించింది.

ఎల్జీ కే20 ఫోన్
ఎల్జీ తాజాగా కే సిరీస్‌లో ఎల్జీ కే20 ఫోన్ ని విడుదల చేసింది. దీని ధర రూ.7,000గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ యూరప్ మార్కెట్లో అందుబాటులో ఉంది. బ్లాక్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభ్యమౌతోంది. ఫోన్లో 5.45 అంగుళాల స్క్రీన్, ఫుల్‌విజన్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఫోన్లో ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఇందులో వెనుక భాగంలో 8 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇక కంపెనీ ఫోన్ ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చింది. ముందు భాగంలో కూడా ఫ్లాష్ ఉంటుంది. ఎల్జీ కే20 ఫోన్లో ఆండ్రాయిడ్ 9 పై (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే ఇందులో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 4జీ, వైఫై, బ్లూటూత్ 4.2, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రో యూఎస్బీ పోర్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఎల్జీ ఎక్స్2 (2019)
దీంతో పాటుగా కంపెనీ ఎల్జీ ఎక్స్2 (2019). ఇదొక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. కంపెనీ ఈ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో ఎల్జీ కే30 (2019)ను దక్షిణ కొరియా మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీన్ని గ్లోబల్ మార్కెట్లో ఎల్జీ కే30 (2019) పేరుతో లాంచ్ చేయనుంది. కంపెనీ గతేడాదే ఎల్జీ ఎక్స్2 ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఆ ఫోన్లోనే అప్‌గ్రేడ్ వెర్షన్‌ను మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఎల్జీ ఎక్స్2 (2019) ధర దాదాపు రూ.11,500గా ఉండొచ్చు. ఇది కేవలం నలుపు రంగులోనే అందుబాటులో ఉంటుంది.

ఎల్జీ ఎక్స్2 ఫీచర్లు
ఎల్జీ ఎక్స్2 ఫోన్లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 5.45 అంగుళాల స్క్రీన్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండొచ్చు. కంపెనీ ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్‌ను ద్రువీకరించింది. అయితే భారత్‌లోకి ఎప్పుడు వస్తోందో తెలియాల్సి ఉంది. ఫోన్ వెనుక భాగంలో 13 ఎంపీ కెమెరా ఉంటుంది. కంపెనీ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చింది. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790