ఫస్ట్ రిలీజ్ అక్కడే!

By Prashanth
|

ఫస్ట్ రిలీజ్ అక్కడే!

 

2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రదర్శనలో ఎల్‌జీ ప్రకటించిన ఆప్టిమస్ ఎల్7 స్మార్ట్‌ఫోన్ ఈ మేలో విడుదలకు సిద్ధమైంది. గెలాక్సీ ఎస్ 3 ఆవిష్కరణ అనంతరం మార్కెట్‌కు పరిచయం కాబోతున్న ఈ హ్యాండ్‌సెట్‌ను తొలత యూకెలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఎల్‌జీ ‘ఎల్’ సిరీస్ నుంచి రాబోతున్న ఆప్టిమస్ ఎల్7 కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

4.3’’ WVGA డిస్‌ప్లే,

విస్తృత వీక్షణ సౌలభ్యత,

5 మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరా,

కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్.

ఉత్తమమైన పనితీరుతో పాటు స్టైల్ ఇంకా హుందాను కోరుకునే వారికి ఈ స్మార్ట్‌ఫోన్ సరి అయిన ఎంపిక. ఫోన్ ధర ఇతర స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ‘ఆప్టిమస్ ఎల్ 7’ స్మార్ట్‌ఫోన్ పై ఎల్‌జీ భారీగానే ఆశలు పెట్టుకుంది. హై‌ఎండ్ స్పెసిఫికేషన్‌లతో తాము డిజైన్ చేసిన ఈ హ్యాండ్‌సెట్ అత్యధిక మంది గ్యాడ్జెట్ ప్రియులను ఆకర్షించగలదని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచమంతా సామ్‌సంగ్ స్మరణ జపిస్తున్న నేపధ్యంలో ఎల్‌జీ ప్రవేశపెట్టబోతున్న ఆప్టిమస్ ఎల్7 ఏ మేరకు అంచనాలను తాకుతుందో చూడాలి.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X