దమ్ముందా.. 15లక్షలు మీ సొంతం!

Posted By: Prashanth

దమ్ముందా.. 15లక్షలు మీ సొంతం!

 

న్యూఢిల్లీ: మోడ్రన్ టెక్నాలజీ అదేవిధంగా మొబైల్ టెక్నాలజీ రంగంలో క్రీయాశీలక పాత్రపోషిస్తూ భారతీయుల సుపరిచత బ్రాండ్ గా గుర్తింపుతెచ్చుకున్న ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఫోన్ ఐడియా క్యాంప్ పేరుతో వినూత్న ప్రచార కార్యక్రమాన్ని బుధవారం నుంచి ప్రారంభించింది. వినియోగదారుతో మమేకమయ్యే సదుద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతిభనో ప్రోత్సాహించే ప్రయత్నాన్ని ఎల్ జీ శ్రీకారం చుట్టింది. రెండు నెలల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్ జీ ఇండియా ప్రతిభగల వారికి అవకాశం కల్పించనుంది.

ఈ పోటీలో పాలుపంచుకునే ఔత్సాహికులు కొత్తదనంనిండిన అప్లికేషన్, ఫీచర్, కాన్సెప్ట్, సర్వీస్, డిజైన్, యూజర్ ఇంటర్ ఫేస్ (యూఐ) తదితర అంశాలను www.lg.com/in/smartphoneideacamp.jsp ద్వారా ఎల్ జీతో షేర్ చేసుకోవచ్చు. వీటిలో ఉత్తమమైన వాటిపి ఎంపిక చేసిన వాటిని ఎల్‌జీ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో పొందుపరచటంతో పాటు రూ.15లక్షల నగదు బహుమతిని అందించనున్నారు. వినియోగదారుల్లోని సృజనాత్మకతతో పాటు ప్రతిభను వెలికితీసే క్రమంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎల్‌జీ ఇండియా మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ హెడ్ సంజయ్ మహేశ్వరీ ఒక ప్రకటనలో తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot