‘ మే’లో మరో బీభత్సం..మీరు సిద్ధమేనా?

By Super
|
LG to D1L smartphone to launch in May


రానున్న మే మరో బృహత్తర ఆవిష్కరణకు వేదిక కానుంది. అత్యధిక మంది వినియోగదారులచే నెంబర్1 బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎల్‌జీ ఓ హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కోడ్ నెం ‘D1L’. డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్, ఎల్‌టీఈ కనెక్టువిటీ వంటి పటిష్టమైన వ్యవస్థలను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు ఎల్‌జీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా బహిర్గతమయ్యాయి. ఎల్‌జీ ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘ఆప్టిమస్ 4X HD’కి రానున్న ఫోన్ అప్‌డేటెడ్ వర్షన్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ఎల్‌జీ థింకింగ్ స్మార్ట్‌ఫోన్:

స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో భేష్ అనిపించుకునేందుకు ఎల్‌జీ నిర్విరామంగా శ్రమిస్తోంది. ఆప్టిమస్ 2ఎక్స్ పేరుతో తొలి డ్యూయల్ కోర్ హ్యాండ‌సెట్‌ను ప్రవేశపెట్టిన ఎల్‌జీ అనతికాలంలోనే ఈ ప్రాసెసర్ల సంఖ్యతో పాటు శక్తిని రెట్టింపు చేస్తూ క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. ఇవేకాకుండా పలు హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసినప్పటికి లీడింగ్ స్థానాన్ని అధిరోహించలేక పోయింది. కారణం మార్కెట్లో శామ్‌సంగ్ ఇస్తున్న పోటీనే.

 

ఈ క్రమంలో కొత్త పంధాలో దూసుకువెళ్లేందుకు ఎల్‌జీ ప్రణాళికలు సిద్ధం చేసింది.

థింకింగ్ స్మార్ట్‌ఫోన్ పేరుతో కొత్త తరహా కాన్పెప్ట్‌కు ఈ టాప్‌బ్రాండ్ శ్రీకారం చుట్టింది. ఈ అంశం పై ఎల్‌జీ మొబైల్ కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ స్పందిస్తూ తాము ప్రవేశపెట్టబోతున్న థింకింగ్ ఫోన్, వినియోగదారుని అవసరాలు తీర్చటంతో పాటు అతని ఎదుగుదలకు తోడ్పడుతుందని వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా లోడ్ చేసిన నిర్థిష్ట ప్రణాళికా వ్యవస్థ సదురు వినియోగదారును ఆ విధంగా ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు: ఉదయాన్నే నిద్రలేపటం, చేయ్యాల్సిన పనుల గురించి ముందుగా గుర్తుచెయ్యటం తదితర అంశాలు. నోకియా రూపొందించిన లూమియా 900 తరహాలో ఓ హ్యాండ్‌సెట్‌ను డిజైన్ చేసేందుకు ఎల్‌జీ సన్నాహాలు చేస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X