అగష్టులో విప్పిదట!

Posted By: Prashanth

అగష్టులో విప్పిదట!

 

ఉపయుక్తమైన యూజర్ ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను సమకూర్చే అంతర్జాతీయ బ్రాండ్ ఎల్‌జీ, తాను ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్మార్ట్‌ఫోన్ ‘ఆప్టిమస్ వీయూ 2’ను అగష్టులో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తుంది. జర్మనీలో వచ్చే నెళాఖరుకు నిర్వహించనున్న ‘ఐఎఫ్ఏ 2012’ కర్యాక్రమంలో ఈ లాంచ్ ఉండొచ్చని తెలుస్తోంది.

సౌత్‌కొరియన్ న్యూస్ పేపర్, డైలీ కొరియన్ వెల్లడించిన సమాచారం మేరకు ‘ఆప్టిమస్ వీయూ 2’ 5 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ పీసీ లక్షణాలను ఒదిగి ఉండే ఈ డివైజ్‌ను ఫాబ్లెట్‌గా పిలుస్తున్నారు. గతేడాది ఐఎఫ్ఏ సదస్సులో గెలాక్సీ నోట్ ఫాబ్లెట్‌ను ఆవిష్కరించిన సామ్‌సంగ్ ఈ ఏడాది గెలాక్సీ నోట్ ఫాబ్లెట్ 2ను ఆవిష్కరించనుంది. ఈ నేపధ్యంలో సామ్‌సంగ్‌కు ఎల్‌జీ గట్టి పోటీనివ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ 2 ఫీచర్లు (అంచనా):

5 అంగుళాల హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

రిసల్యూషన్ 720 పిక్సల్స్,

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ఎమ్ఎస్ఎమ్8960 ప్రాసెసర్,

ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot