LG నుంచి సరికొత్త వాటర్ ప్యూరిఫయ్యర్స్, స్టెయిన్‌లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంకులతో లభ్యం

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపరణాల తయారీ కంపెనీ ‘ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్’, తన ప్యూరికేర్ (PuriCare) సిరీస్ నుంచి సరికొత్త వాటర్ ప్యూరిఫైర్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

|

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపరణాల తయారీ కంపెనీ 'ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్’, తన ప్యూరికేర్ (PuriCare) సిరీస్ నుంచి సరికొత్త వాటర్ ప్యూరిఫైర్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. స్టెయిన్‌లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంకులతో వస్తోన్న ఈ వాటర్ ప్యూరిఫైర్స్‌ మొత్తం ఏడు రకాల వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

lg-unveils-distinct-water-purifiers-featuring-stainless-steel-tanks

డ్యుయల్ ప్రొటెక్షన్ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్, డిజిటల్ స్టెరిలైజింగ్ కేర్ వంటి హైజీనిక్ ఎన్‌హాన్సింగ్ ఫీచర్స్‌తో ఎక్విప్ కాబడిన ఈ వాటర్ ప్యూరిఫైర్స్‌ స్వచ్ఛమైన ఇంకా సురక్షితమైన త్రాగునీరును అందించగలుగుతాయని ఎల్‌జీ తెలిపింది. ప్యూరికేర్ రేంజ్ నుంచి ఎల్‌జీ విడుదల చేసిన ప్యూరిఫైర్స్‌ WW180EP, WW170EP, WW160EP, WW121EP, WW120EP, WW130NP, WW140NP వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

5 దశల్లో ఆర్‌ఓ ఫిల్టరేషన్..

5 దశల్లో ఆర్‌ఓ ఫిల్టరేషన్..

వాటర్ ప్యూరిఫైయిర్లకు ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది చాలా కీలకం. ఈ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకున్న ఎల్‌జీ, తన ప్యూరికేర్ రేంజ్ ప్యూరిఫయ్యర్స్‌లో మల్టీ స్టేజ్ రివర్స్ ఓస్మోసిస్ ఆర్‌ఓ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. ఓస్మోసిస్ ఆర్‌ఓ సిస్టమ్ అనేది మల్టీ-స్టేజ్ ఫిల్టరేషన్ పద్థతిలో నీటిని శుద్థి చేయగలుగుతుంది. 5 దశల్లో జరిగే ఆర్‌ఓ ఫిల్టరేషన్ ప్రాసెస్‌లో భాగంగా నీటిలోని బ్యాక్టీరియా, వైరస్ ఇంకా హెవీ మోటల్స్ పూర్తిగా నిర్మూలించబడతాయట. ఇదే సమయంలో మినరల్ బూస్టర్ ద్వారా ఫిల్టర్ అయిన నీటికి పోషక విలువలు కూడా యాడ్ అవుతాయని ఎల్‌జీ తెలిపింది.

 

 

డ్యుయల్ ప్రొటెక్షన్ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్

డ్యుయల్ ప్రొటెక్షన్ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్

ఎల్‌జీ ప్యూరికేర్ వాటర్ ప్యూరిఫయర్లకు డ్యుయల్ ప్రొటెక్షన్ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ప్రత్యేకమైన స్టీల్ ట్యాంక్ వ్యవస్థ నీటిలో బ్యాక్టీరియా, నాచు వంటివి పెరగకుండా చూస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్, బ్యాక్టీరియా వ్యాప్తిని 94.4 శాతం వరకు తగ్గించగలుగుతుందని ఎల్‌జీ తెలిపింది. 8 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉండే ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్స్ నీటిని మరింత తాజాగా ఉంచుతాయట.

యూవీ ప్లస్ ఇంకా స్మార్ట్ డిస్‌ప్లే
 

యూవీ ప్లస్ ఇంకా స్మార్ట్ డిస్‌ప్లే

ఎల్‌జీ ప్యూరికేర్ వాటర్ ప్యూరిఫయర్స్‌లో ఏర్పాటు చేసిన 5 స్టేజ్ ఆర్‌ఓ ఫిల్టరేషన్ వ్యవస్థ, యూవీ (UV)తో పనిలేకుండా ఫిల్టరేషన్ దశలోనే వైరస్ అలానే బ్యాక్టీరియాలను నిర్మూలిస్తుందట. ఈ ప్యూరిఫయ్యర్స్‌లో ఏర్పాటు చేసిన యూవీ సైకిల్, స్టోరేజ్ దశ నుంచే రన్ అవ్వటం ప్రారంభిస్తుందట. స్టీల్ ట్యాంక్‌లో స్టోర్ అయి ఉండే ఫిల్టర్ వాటర్‌ను ప్రతి 6 గంటలకు ఒకసారి స్కాన్ చేసి బ్యాక్టీరియా నిరోధిస్తుందట.

2 ఇన్ 1 కేర్

2 ఇన్ 1 కేర్

ఎల్‌జీ ప్యూరికేర్ వాటర్ ప్యూరిఫయర్స్‌లో ఎక్విప్ చేసిన 2 ఇన్ 1 కేర్ ఫీచర్ ద్వారా పళ్లు ఇంకా కూరగాయలను మరింత శుభ్రతతో క్లీన్ చేసుకునే వీలుంటుందట. ఈ వాటర్ ప్యూరిఫయర్స్‌ సైడ్ భాగాల్లో ఏర్పాటు చేసిన సెకండరీ వాల్వ్ ద్వారా ఈ క్లీనింగ్ ప్రాసెస్ నిర్వహించుకోవచ్చు.

ట్రూ మెయింటేనెన్స్ ఆఫర్స్..

ట్రూ మెయింటేనెన్స్ ఆఫర్స్..

లాంచ్ ఆఫర్స్ క్రింద ఈ వాటర్ ప్యూరిఫయర్స్‌ కొనుగోలు పై ఏడాది పాటు ఉచిత మెయింటేనెన్స్‌ను ఎల్‌జీ ప్రొవైడ్ చేస్తోంది. ఈ ఉచిత మెయింటేనెన్స్ వల్ల యూజర్‌కు రూ.4200 వరకు ఆదా అవుతుందని ఎల్‌జీ తెలిపింది. ఉచిత మెయింటేనెన్స్‌ సమయంలో ఎల్‌జీ సర్వీస్ ఇంజినీర్ మూడు సార్లు హోమ్ విజిట్ చేసి ప్యూరిఫయర్ వర్కింగ్ కండీషన్‌ను చెక్ చేస్తారు. ఇదే సమయంలో డిజిటల్ స్టెరిలైజింగ్ కేర్‌ను కూడా ఎల్‌జీ ప్రొవైడ్ చేయబోతోంది.

Best Mobiles in India

English summary
LG unveils distinct water purifiers featuring stainless steel tanks.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X