'ఎల్‌జీ' కొత్త ట్యాగ్ లైన్ సింప్లీ సూపర్బ్

Posted By: Prashanth

'ఎల్‌జీ' కొత్త ట్యాగ్ లైన్ సింప్లీ సూపర్బ్

 

ఈరోజు నుండి బార్సిలోనాలో ప్రారంభం కానున్న టెక్నాలజీ ఈవెంట్ 'మొబైల్ కాంగ్రెస్ వరల్డ్ 2012' లో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ కొత్తగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందించిన ఆరు కొత్త హ్యాండ్ సెట్స్‌ని ప్రదర్శనకు ఉంచనుంది. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌కి ఎల్‌జీ ఓ సరిక్రొత్త ట్యాగ్ లైన్‌ని ఆవిష్కరించింది. ఎల్‌జీ కొత్తగా పెట్టిన ట్యాగ్ లైన్ 'LTE, its always LG'. ఈ ఆరు కొత్త స్మార్ట్ ఫోన్స్‌లలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే 4జీ కనెక్టివిటీని ఇవి సపోర్ట్ చేస్తాయి.

ప్రపంచంలో ఉన్న మొబైల్ కంపెనీలతో పోలిస్తే ఎల్‌జీ కంపెనీకి అతి పెద్ద మొబైల్ కలెక్షన్ ఉంది. తాను కొత్తగా రూపొందించిన ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 3, ఎల్ 5, ఎల్ 7 మొబైల్స్‌ని కస్టమర్స్‌కు ఎప్పుడెప్పుడు పరిచయం చేద్దామా అని ఊవిళ్లూరుతున్న కంపెనీకి 'మొబైల్ కాంగ్రెస్ వరల్డ్ 2012' ఈవెంట్ ఓ చక్కని వేదికగా నిలవనుంది. అంతేకాకుండా ఎల్‌టిఈ కనెక్టివిటీ కలిగి ఉన్న కొత్త డివైజ్ 'ఎల్‌జీ ఆప్టిమస్ వియు' గురించే ఎక్కడ చూసిన ఇప్పడు చర్చ. పవర్‌పుల్ ఫెర్పామెన్స్‌తో సూపర్ డిజైన క్వాలిటీతో ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్స్‌ని ఓ లెవల్‌కి తీసుకోని వెళ్లాలని ఎల్‌జీ ఆలోచిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot