బల్పు కింద ఫోన్ :సెకనుకు 23 సినిమాలు డౌన్‌లోడ్..

Written By:

టెక్నాలజీ కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న నేటి తరుణంలో వైఫైని తలదన్నేలా కొత్త టెక్నాలజీ ముందుకు దూసుకువస్తోంది. అదే లైఫై..ఇప్పటిదాకా వైఫై టెక్నాలజీనే మనం చూసాం కాని ఈ లైఫై టెక్నాలజీతో చిత్ర విచిత్రాలను చూడబోతున్నాం. వైర్ లెస్ టెక్నాలజీతో లైఫై టెక్నాలజీ దూసుకొస్తోంది. లైటు కింద ఫోన్ పెట్టగానే అది ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి సెకన్‌కు 23 సినిమాలు డౌన్ లోడ్ చేసే కెపాసిటి వస్తుందట..

Read more : వైఫైని వణికిస్తున్న లైఫై

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒక్క క్షణం కరెంటు బల్బు కింద మన మొబైల్ ఫోన్‌ పెట్టగానే

వైఫై సిగ్నల్‌, పాస్‌వర్డ్ వంటివి లేకుండా కేవలం ఒక్క క్షణం కరెంటు బల్బు కింద మన మొబైల్ ఫోన్‌ పెట్టగానే.. అది ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయితే ఎలా ఉంటుంది.. అద్భుతం కదా? అలాంటి అద్భుతాన్ని సుసాధ్యం చేస్తానంటోంది లై-ఫై టెక్నాలజీ.

వైఫై విధానం కన్నా 100 రెట్లు వేగంగా పనిచేసే ఈ సాకేంతిక పరిజ్ఞానం

ప్రస్తుత వైఫై విధానం కన్నా 100 రెట్లు వేగంగా పనిచేసే ఈ సాకేంతిక పరిజ్ఞానం.. వైర్‌లెస్‌ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు లైఫై టెక్నాలజీని ఫ్రాన్స్‌ కు చెందిన స్టార్టప్ కంపెనీ ఒలెడ్‌కమ్‌.. బర్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ప్రదర్శించింది.

కార్యాలయంలోని ఓ బల్బు కింద స్మార్ట్‌ఫోన్‌ పెట్టగానే

ఈ ప్రదర్శనలో భాగంగా కార్యాలయంలోని ఓ బల్బు కింద స్మార్ట్‌ఫోన్‌ పెట్టగానే అది ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయింది. అందులో ఓ ఆన్‌లైన్ వీడియో సైతం వేగంగా ప్లే అయింది. 'లైట్‌ ఇన్‌ఫిడలిటీ' సంక్షిప్త నామమైన 'లైఫై' పేరుకు తగ్గట్టే మెరుపు వేగంతో పనిచేస్తుంది.

లాబరేటరీ పరీక్షల్లో ఈ టెక్నాలజీ ద్వారా

లాబరేటరీ పరీక్షల్లో ఈ టెక్నాలజీ ద్వారా ఒక సెకనుకు 200 జీబీ డాటా ట్రాన్స్‌ఫర్ కావడం గమనార్హం. అంటే కేవలం ఒక సెకనులోనే 23 డీవీడీ సినిమాలను ఈ టెక్నాలజీ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఒలెడ్‌కామ్‌ అధిపతి స్వాట్‌ తాప్సు తెలిపారు.

వెఫై కన్నా లైఫై వందరెట్లు వేగంగా పనిచేస్తుందని

వెఫై కన్నా లైఫై వందరెట్లు వేగంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. వైఫై రేడియో తరంగాల ఆధారంగా డాటాను బట్వాడా చేస్తుండగా.. ఎల్‌ఈడీ బల్బుల నుంచి వెలువడే ఫ్రీక్వెన్సీస్‌ ఆధారంగా లైఫై డాటాను ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంది.

డిజిటల్ మోర్స్ కోడ్‌ సమానంగా

డిజిటల్ మోర్స్ కోడ్‌ సమానంగా ఒక సెకనులో మెరుపువేగంతో సమాచారాన్ని బదిలీ చేయడం లైఫై టెక్నాలజీ ప్రత్యేకత. దీనిని ఇప్పటికే భారత్, బెల్జియం, ఇస్టోనియా వంటి దేశాల్లోని షాపింగ్ మాళ్లు, మ్యూజియంలలో పరీక్షించారు.

వైఫైని లైఫై (ఎల్‌ఐఎఫ్ఐ) ఈ దెబ్బతో వెనక్కినెట్టేసినట్లే

మాములుగా ఫ్లాపీలను సీడీలు ఆక్రమిస్తే.. సీడీలను పెన్‌ డ్రైవ్‌లు ఆక్రమించడాన్ని చూశాం! మరి.. తాజాగా అందుబాటులో ఉన్న వైఫైని లైఫై (ఎల్‌ఐఎఫ్ఐ) ఈ దెబ్బతో వెనక్కినెట్టేసినట్లే. లైఫై ద్వారా హై-డెఫినెషన్‌ సినిమాలు, వీడియో గేమ్స్‌, ఆల్బమ్స్‌ క్షణాల్లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెబుతున్నారు.

224 గిగా బైట్స్ వేగంతో పనిచేసే ఈ లైఫైని మొదటగా

224 గిగా బైట్స్ వేగంతో పనిచేసే ఈ లైఫైని మొదటగా స్కాట్ ల్యాండ్ ఎడిన్ బర్గ్ విశ్వ విద్యాలయానికి చెందిన హెరాల్డ్ హాస్ 2011 లో కనుగొన్నారు. ఒకే ఎల్ ఈ డీ నుంచి ప్రసారమయ్యే మినుకు మినుకుమనే కాంతి ద్వారా సెల్యులార్ టవర్ కంటే ఎక్కువగా డేటా ప్రసారం అవుతుందని హాస్ ప్రదర్శించారు.

మోర్స్ కోడ్ మాదిరిగానే ఈ వ్యవస్థ కాంతిని ఉపయోగించి

మోర్స్ కోడ్ మాదిరిగానే ఈ వ్యవస్థ కాంతిని ఉపయోగించి ప్రసారం చేసినా.. కంటితో గుర్తించలేనంత వేగంతో కమ్యూనికేషన్ నడుస్తుందని చెప్తున్నారు. ఈ విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పలు పైలట్ ప్రాజెక్ట్ లను నిర్వహించిన పరిశోధకులు...ఇప్పుడు బయటి ప్రపంచానికి దాన్ని పరిచయం చేశారు.

ఇప్పటికే 'ఒలెడ్ కాం' అనే ఓ ఫ్రెంచ్ సంస్థ లైఫై వాడకంతోపాటు

ఇప్పటికే 'ఒలెడ్ కాం' అనే ఓ ఫ్రెంచ్ సంస్థ లైఫై వాడకంతోపాటు.. ఈ వ్యవస్థను స్థానిక ఆసుపత్రుల్లో కూడ ఇన్ స్టాల్ చేసింది. ఈ లైఫై వైర్ లెస్ డేటా ట్రాన్స్ మిషన్ భవిష్యత్తును మరింత కాంతివంతంగా, ప్రకాశవంతంగా చేస్తుందని సైంటిస్ట్ హాస్ ఆశిస్తున్నారు.

లైఫైకి పరిమితులంటూ ఉన్నాయి

అయితే, లైఫైకి పరిమితులంటూ ఉన్నాయి! దీని తరంగాలు వైఫై మాదిరి గది గోడలను అధిగమించలేవట! ఏది ఏమైనా ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే.. వైఫై కనుమరుగు కావొచ్చునని నిపుణులు చెప్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సంబంధించిన వీడియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Li-Fi: 100 times faster than Wi-Fi, tests prove
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot