Home
News

LIC అలర్ట్,ఈ జాగ్రత్తలు పాటించకుంటే మీ కొంప కొల్లేరే

By Gizbot Bureau

అతిపెద్ద ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( LIC ) గురించి అందరికీ తెలుసు. కోట్లాది మంది పాలసీ హోల్డర్లకు సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా మంది ఎల్ఐసీ పాలసీలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ఎల్ఐసీ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి.

LIC warns customers against spurious calls; Know how you can be tricked and how to avoid it

పాలసీ ల్యాప్స్ అవుతుందని, బోనస్ వచ్చిందని రకరకాల పద్ధతుల్లో పాలసీ హోల్డర్లను ఛీటర్లు మోసం చేస్తున్నారు. అయితే పాలసీ తీసుకునే ముందు, తర్వాత కొన్ని జాగ్రత్తలు అనుసరించాలి. లేకపోతే మోసపోవలసి వస్తుంది. కాస్త అప్రమత్తంగా ఉంటే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు. మరి పాలసీ హోల్డర్లు కాల్స్, మెసేజెస్, ఇమెయిల్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా అలర్ట్‌గా ఉండాలో ఎల్ఐసీ వివరిస్తోంది. ఎల్ఐసీ ఇస్తున్న సలహాలు, సూచనలు ఓ సారి పరిశీలిద్దాం.

 ఎల్ఐసీ ఫేవర్‌గా చెక్‌లో వివరాలు

ఎల్ఐసీ ఫేవర్‌గా చెక్‌లో వివరాలు

ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తున్నారా? కాస్త జాగ్రత్త. చెక్ ద్వారానే ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించాలి. ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెక్ రూపంలో చెల్లించేటప్పుడు.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫేవర్‌గా చెక్‌లో వివరాలు నింపండి. ఇతరుల పేర్ల మీద చెక్ ఇవ్వాలని అడిగితే అస్సలు ఒప్పుకోవద్దు. ఎల్ఐసీ పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద చెక్ ఇష్యూ చేయాలని కోరితే నేరుగా కంపెనీకి ఈ విషయాన్ని తెలియజేయండి.

 ఆన్‌లైన్‌ చెల్లింపులు

ఆన్‌లైన్‌ చెల్లింపులు

ఎల్ఐసీ పాలసీ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగానే తెలుసుకోవచ్చు. అది కూడా ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎల్ఐసీతో ఒప్పందం చేసుకున్న పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాలసీ ప్రీమియం చెల్లించొచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ www.licindia.in అప్పుడప్పుడూ ఓపెన్ చేస్తూ పాలసీ స్టేటస్ చూస్తుండాలి. పాలసీ అప్‌డేట్స్ తెలుసుకోవాలి.

 పూర్తిగా చదివిన తర్వాతనే..

పూర్తిగా చదివిన తర్వాతనే..

ఏజెంట్లు అందించే ఏ డాక్యుమెంట్‌‌ పైనైనా పూర్తిగా చదివిన తర్వాతనే సంతకం చేయండి. ఒకవేళ మీరు చదవకుండా సంతకం చేస్తే మోసపోయే అవకాశముంది. డాక్యుమెంట్ చదవడానికి కొంత సమయం తీసుకున్నా పర్లేదు. నియమనిబంధనలన్నీ చదివితే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి.

పాలసీ డాక్యుమెంట్‌

పాలసీ డాక్యుమెంట్‌

ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్‌ను ఎవ్వరికీ ఇవ్వొద్దు. ఎల్ఐసీ ఎవ్వరికీ కూడా మీ ఒరిజినల్ పేపర్లు తీసుకోవడానికి అనుమతిని ఇవ్వలేదు. మీ పాలసీ బాండ్ తీసుకునే అధికారం ఎవరికీ లేదు.

ఫోన్ కాల్స్‌ అన్నీ మోసపూరితం

ఫోన్ కాల్స్‌ అన్నీ మోసపూరితం

ఎల్ఐసీ ఆఫర్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మొద్దు. మీకు ఎవరైనా ఫోన్ చేసి పాలసీ ఏజెంట్ అని చెప్పి మోసగించే అవకాశముంది. ఎల్ఐసీ ఏజెంట్ పేరుతో సంప్రదించినా పాలసీ తీసుకునే ముందు ఏజెంట్ ఐడీ కార్డ్ చూడండి. మీ వద్దకు వచ్చింది ఎల్ఐసీ ఏజెంట్ అని ధ్రువీకరించకున్న తర్వాతనే పాలసీ తీసుకొని డబ్బులు చెల్లించండి.
బోనస్, ఔట్ స్టాండింగ్ ఇన్‌స్టాల్‌మెంట్లకు సంబంధించి పాలసీదారులకు కాల్ చేస్తుంటారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. బోనస్ లేదా ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్స్ కోసం ఎల్ఐసీ సంస్థ పాలసీ హోల్డర్లను ఫోన్‌లో ఎప్పుడూ సంప్రదించదు. అలాంటి కాల్స్ అన్నీ మోసపూరితం అన్న విషయం గుర్తుంచుకోండి.

నెఫ్ట్ ఆన్‌లైన్ పేమెంట్

నెఫ్ట్ ఆన్‌లైన్ పేమెంట్

నెఫ్ట్ ఆన్‌లైన్ పేమెంట్ మార్గంలో ఎల్ఐసీ చెల్లింపులు నిర్వహించడం ఉత్తమమైన మార్గం. మీకు ఏమైనా మోసపోయి ఉంటే [email protected]‌కు మెయిల్ చేయండి. లేదంటే ఎల్ఐసీ పర్సనెల్ డిపార్ట్‌మెంట్‌కు లేఖ కూడా రాయవచ్చు.

Best Mobiles in India

English summary
LIC warns customers against spurious calls; Know how you can be tricked and how to avoid it
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X