సెండ్ బటన్ ద్వారా సమాచారం కొంత మంది స్నేహితులకు మాత్రమే

Posted By: Super

సెండ్ బటన్ ద్వారా సమాచారం కొంత మంది స్నేహితులకు మాత్రమే

ఫేస్‌బుక్ పేజిలలో ఓ కొత్త బటన్ వచ్చి చేరనుంది. ఇప్పటి వరకు ఫేస్‌బుక్ పేజిలలో మనకు దర్శనమిచ్చినటువంటి లైక్, షేర్ బటన్స్‌తో పాటు కొత్తగా సెండ్ బటన్ వచ్చి చేరనుంది. ఫేస్‌బుక్ పేజిలలో బాగా పాపులర్ అయినటువంటి లైక్ బటన్ వరల్డ్ వైడ్ వెబ్‌లో సంవత్సరం పాటు తన హావాని కొనసాగించింది. లైక్ బటన్ చూడడానికి ధమ్స్ అప్ ఆకారంలో ఉండేటటువంటి ఐకాన్‌ని కలిగి ఉండి ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నటువంటి కంటెంట్‌ని మనకు నచ్చినటువంటి విడియోలను ప్రెండ్స్‌తో షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఇక సెండ్, లైక్ బటన్‌ల మద్య ఉన్నటువంటి తేడా ఏమిటంటే లైక్ బటన్ ద్వారా మీరు ఏదైనా వీడియోని షేర్ చేశారంటే ఆవీడియో ఫేస్‌బుక్‌లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరూ చూడడానికి వీలవుతుంది. కానీ సెండ్ బటన్ ఉపయోగం ఏమిటంటే మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి ప్రెండ్స్‌కి మాత్రమే కంటెంట్ పంపించదలచుకుంటే అది వారికి మాత్రమే వెళుతుంది. మీరు సెండ్ బటన్ క్లిక్ చేయగానే మీరు పంపదలచుకున్న కంటెంట్ ఏదైతే ఉందో అది మీకు నచ్చిన ప్రెండ్స్‌ ఈ మెయిల్స్‌ని ఫేస్‌బుక్ ద్వారా సెలక్ట్ చేసుకొండంటూ వస్తుంది.

ఈ సందర్బంలో ఫేస్‌బుక్ గ్రూప్స్ టీమ్‌కు సంబంధించిన ఇంజనీర్ ఎల్లిట్ లిండ్యే మాట్లాడుతూ పోయిన సంవత్సరం ఇదే సమయంలో మేము లైక్ బటన్‌ని పేస్‌బుక్ లోకి విడుదల చేయడం జరిగింది. దీనివల్ల మీరు వెబ్‌లో కనుగోన్న సమాచారాన్ని మీ స్నేహితులతో చాలా త్వరగా షేర్ చేసుకునే వీలును కల్పించడం జరిగింది. కానీ నీకు నచ్చిన స్నేహితులకు మాత్రమే షేర్ చేసుకునే అవకాశం కోసం ఇప్పుడు ఈ సంవత్సరం సెండ్ బటన్‌ని పేస్‌బుక్‌లో యాడ్ చేయడం జరుగుతుంది.

చాలా మంది వెబ్ సైట్లు పేస్‌బుక్ లైక్ బటన్‌ని ఇంటిగ్రేట్ చేసుకోవడం జరిగింది. లైక్ బటన్‌ని విడుదల చేసిన వారానికే దాదాపు 50,000 వెబ్ సైట్స్ దానిని ఇంటిగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 2.5మిలియన్ వెబ్ సైట్లు ఇంటి గ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి సెండ్ బటన్‌ని కూడా చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. దీనికోసం మీరు లైక్ బటన్‌కి బదులు సెండ్=ట్రూ అనే ఎట్రిబ్యూట్‌ని యాడ్ చేస్తే సరిపోతుంది.

ఈ సెండ్ బటన్‌తో పాటు పేస్‌బుక్ కొన్ని కొత్త విధానాలను కూడా విడుదల చేస్తుంది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గవి పోల్స్, ఫోటో ఆల్బమ్స్, పోస్టింగ్ క్వచ్చన్స్. ఈ ఆఫ్షన్ పేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్నప్పటి నుండి దాదాపు 50మిలియన్ గ్రూప్స్ క్రియేట్ అవ్వడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot