మీ పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసారా? చేయకపోతే, ఈ నెంబర్లకు SMS చేయండి

|

ఆధార్ నెంబర్‌ను PAN నెంబర్‌తో లింక్ చేసుకునేందుకు గాను ఎస్ఎంఎస్ సౌకర్యాన్నిఅందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని తమ ఆధార్ నెంబర్లను పాన్ నెంబర్లతో లింక్ చేసుకోవచ్చని కోరింది.

 

567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ చేయటం ద్వారా

567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ చేయటం ద్వారా

మొబైల్ ఫోన్ నుంచి 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ చేయటం ద్వారా ఆధార్, పాన్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుందని, ఎస్ఎంఎస్ చేసే ప్రొసీజర్‌ను జాతీయ దినపత్రికల్లో ప్రచురించిన ప్రకటనల్లో వివరించినట్లు ఐటీ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

దాయ పన్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌‌సైట్ ద్వారా కూడా..

దాయ పన్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌‌సైట్ ద్వారా కూడా..

ఆధార్‌తో పాన్‌ను లింక్ చేసే ప్రాసెస్‌ను ఆదాయ పన్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌‌సైట్ ద్వారా కూడా చేపటవచ్చని ఆదాయ పన్ను శాఖ చెబుతోంది. ఈ రెండు కార్డుల్లోని పేర్లులో కొద్దిగా తేడాలు ఉన్నప్పటికి అనుసంధానం చేసుకునే వీలుంటుంది.

పాన్ కార్డ్ తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి..?
 

పాన్ కార్డ్ తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి..?

జూలై 1, 2017 నుంచి పాన్ కార్డ్‌కు ధరఖాస్తు చేసుకునే వారు ఖచ్చితంగా ఆధార్ నెంబర్‌ను కలిగి ఉండాలి.

జూలై 1లోగా తప్పనిసరి..

జూలై 1లోగా తప్పనిసరి..

ఆధార్ కార్డుతో అన్ని ప్రభుత్వ సర్వీసులను లింక్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డును కూడా తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 1, 2017లోగా మీ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవల్సి ఉంది.

ఆధార్‌తో పాన్‌ను లింక్ చేసుకునేందుకు ఎస్ఎంస్ ప్రొసీజర్

ఆధార్‌తో పాన్‌ను లింక్ చేసుకునేందుకు ఎస్ఎంస్ ప్రొసీజర్

UIDPAN అని టైప్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చి మీ 12 డిజిట్ల ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ తరువాత మళ్లీ కొంచం స్పేస్ ఇచ్చి మీ 10 డిజిట్ల పాన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.

UIDPAN <12 digit Aadhar> <10 digit PAN>

టైప్ చేసిన మెసెజ్‌ను 567678 లేదా 56161 నెంబర్ కు ఎస్ఎంఎస్ చేయండి.

 

Best Mobiles in India

English summary
Link Aadhaar with PAN Using SMS, Says Income Tax Department. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X