ఐఆర్‌సీటీసీ అలర్ట్: IRCTC యూజర్ ఐడీతో వెంటనే ఆధార్ లింక్ చేయండి
రైల్వే ప్రయాణికులకు అలర్ట్ అవ్వాల్సిన న్యూస్ ఇది.. మీరు తరుచుగా ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ నుంచి రైల్వే టికెట్లు బుకింగ్ చేస్తున్నారా..అయితే వెంటనే మీరు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే IRCTCలో రెగ్యులర్‌గా రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకునే వారికి ఇండియన్ రైల్వే అధ్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. ప్రయాణికులు నెలలో 12 టికెట్లు వరకు బుకింగ్ చేసుకునేందుకు ఇప్పుడు IRCTC అనుమతి ఇస్తోంది. కాగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో భాగంగా తప్పనిసరిగా యూజర్లు IRCTC IDని ఆధార్ కార్డుతో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.

12 టికెట్లు బుక్ చేయాలంటే ఆధార్ లింక్ తప్పనిసరి
IRCTC కూడా ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రయాణికుల్లో ఎవరైన ఒకరి ఆధార్ కార్డు ద్వారా వెరిఫై చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తోంది. ఒక నెలలో రైల్లో ప్రయాణించే వారి సంఖ్య 6లోపు ఉంటే.. బుకింగ్ సమయంలో ఆధార్ వెరిఫికేషన్ అవసరం లేదని సంస్థ తెలిపింది. 6 దాటితో ఆధార్ లింక్ తప్పనిసరి అని తెలిపింది. ప్రత్యేకించి ఐఆర్ సీటీసీ యూజర్లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ ను ప్రకటించింది. ఆధార్ KYC ఆప్షన్ ద్వారా యూజర్లు తమ ఆధార్ నెంబర్ ను వెరిఫై చేసుకోవాలి. వెబ్ సైట్ పోర్టల్ లో యూజర్ ప్రొఫైల్ దగ్గర వెరిఫై ఆప్షన్ ఉంటుంది.

ప్రయాణికుల ఆధార్ కార్డు నెంబర్లను..
IRCTC యూజర్ తో పాటు రైల్లో ప్రయాణించే ప్రయాణికుల ఆధార్ కార్డు నెంబర్లను కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాసింజర్ మాస్టర్ లిస్టులో ప్రయాణికులందరి ఆధార్ వివరాలను పొందుపరచడం జరుగుతుంది. ట్రైన్ టికెట్లను బుకింగ్ చేసుకోవడానికి ముందే ఐఆర్ సీటీసీ యూజర్ డేటాలో ఎంటర్ చేయడం పూర్తి చేయాలని సంస్థ వెల్లడించింది. ట్రైన టికెట్లు బుకింగ్ చేసుకునే సమయంలో ప్యాసెంజర్ మాస్టర్ లిస్టులో వెరిఫై చేసిన ఆధార్ నెంబర్లను యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక నెలలో అదనంగా 12 టికెట్ల వరకు బుకింగ్ చేసుకోవచ్చు.

ఎలా చేయాలి
ముందుగా IRCTC వెబ్ సైట్ లింక్ ఓపెన్ చేయండి. అక్కడ కనిపించే పోర్టల్ లో యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో Login అవ్వండి. ఆతరువాత My accountలోకి వెళ్లి Link Aadhaar లింక్ పై క్లిక్ చేయండి. అందులో మీకు ఆధార్ KYC పేజీ స్క్రీన్ పై కనిపిస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పేరు మీ ఆధార్ కార్డుపై ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉండాలి. ఆధార్ నెంబర్ లేదా Virtual ID వివరాలను ఇవ్వాలి. అయిన తరువాత చెక్ బాక్సు మీద క్లిక్ చేయండి. Send OTP ఆప్షన్ పై క్లిక్ చేయండి. రిజిస్ట్రర్డ్ మొబైల్ కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి. వెరిఫై OTP ఆప్షన్ పై క్లిక్ చేయండి. Update Aadhaar అనే బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

6 కంటే ఎక్కువ టికెట్లు ఎలా బుక్ చేయాలి
ముందుగా IRCTC వెబ్ సైట్ లింక్ ఓపెన్ చేయండి. అక్కడ కనిపించే పోర్టల్ లో యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో Login అవ్వండి. అక్కడ మీరు యథావిధిగా జర్నీ వివరాలు ఎంటర్ చేసి టికెట్లు బుకింగ్ చేయాలి.ట్రైన్ లిస్టులో బుక్ చేసుకునే ట్రైన్/క్లాసును ఎంపిక చేసుకుని బుకింగ్ ప్రారంభించాలి. మీకు అక్కడ ప్యాసింజర్ ఇన్ పుట్ పేజీలో MY saved Passenger (s)అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. రైట్ సైడ్ ప్యానెల్ నుంచి ఆధార్ వెరిఫై చేసిన ప్యాసింజర్ ను సెలెక్ట్ చేయాలి.ఆటోమాటిక్ గా రిజర్వేషన్ ఫారమ్ లో ప్యాసింజర్ వివరాలు కనిపిస్తాయి.

ఒకరి ఆధార్ లింక్ తప్పనిసరి
మీరు ఎన్ని టికెట్లు బుక్ చేసినా అందులోని మై సేవ్ డ్ లిస్టులోని ప్రయాణికుల్లో ఒకరి ఆధార్ మాత్రం తప్పనిసరిగా వెరిఫై కావాలి.మిగిలిన ప్రయాణికుల ఆధార్ వివరాలను కీబోర్డు ఆధారంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బుకింగ్ ప్రక్రియను కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ప్రయాణికుల వివరాల కింద ఆధార్ నెంబర్, రివ్యూ బుకింగ్ వివరాలను చెక్ చేసుకోవాలి. పేమెంట్ గేట్ వే పేజీపై (క్రెడిట్ లేదా డెబిట్, వ్యాలెట్, బ్యాంకు అకౌంట్) సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ సక్సస్ అయ్యాక.. బుకింగ్ ధ్రువీకరణ పేజీ డిస్ ప్లే అవుతుంది. దీంతో మీ బుకింగ్ ప్రక్రియ పూర్తి అయినట్టే.


Click it and Unblock the Notifications