బెంగుళూరులో 'లింక్డ్ ఇన్' రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్

Posted By: Staff

బెంగుళూరులో 'లింక్డ్ ఇన్'  రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్

'లింక్డ్ ఇన్' సీనియర్ ఎగ్జిక్యూటివ్ అరవింద్ రాజన్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఇండియాలో ఉన్న బెంగుళూరులో 'లింక్డ్ ఇన్' టెక్నాలజీ సెంటర్‌ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాడు. నార్త్ అమెరికాలో కాకుండా మొట్టమొదటి సారి వేరే దేశాలలో ప్రవేశపెడుతున్న మొట్టమొదటి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కావడం విశేషం. ఇండియాలో స్దాపించనున్న కొత్త ఆఫీసు గురించి మిగిలిన విషయాలను వెల్లడించడానికి నిరాకరించారు.

బెంగుళూరులో స్దాపించనున్న 'లింక్డ్ ఇన్' కంపెనీలో రాబోయే కాలంలో కంపెనీ విడుదల చేయనున్న కోర్ ప్రొడక్ట్స్, బేసిక్ టెక్నాలజీల మీద అధ్యయనం చేయనున్నట్లు ప్రముఖ దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కధనంగా ప్రచురించింది. ఇండియాలో ఇప్పటికే 'లింక్డ్ ఇన్' కంపెనీ 70 మంది సేల్స్ ఆఫీసర్స్‌ని తీసుకొవడంమే కాకుండా, త్వరలో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్‌కి గాను 25 నుండి 30 వరకు నెట్ వర్క్ ఇంజనీర్స్‌, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్స్, సాప్ట్‌వేర్ డెవలపర్స్ ని‌ ఎంపిక చేసుకొనున్నట్లు తెలిపారు.

'లింక్డ్ ఇన్' కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలలో 135మిలియన్ రిజిస్టర్ యూజర్స్ ఉన్నారు. ఇందులో ప్రస్తుతం 85మిలియన్ యూజర్స్ 'లింక్డ్ ఇన్'ని వాడడం జరుగుతుంది. 12మిలియన్ యూజర్స్ అప్పుడప్పుడు 'లింక్డ్ ఇన్'కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. 'లింక్డ్ ఇన్' వెబ్‌సైట్ కేవలం ఓ సోషల్ నెట్‌వర్క్‌గా మాత్రమే కాకుండా, ఇండియాలో వేరే ఆపరేషన్స్‌ని కొనసాగించనున్నట్లు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot