Home
News

ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!

By Maheswara

భారతదేశంలో, Samsung, LG మరియు Sony వంటి ప్రముఖ కంపెనీలు పోటీ పడి మరీ 43-అంగుళాలు మరియు 40-అంగుళాల స్మార్ట్ TVలను లాంచ్ చేస్తున్నాయి. కానీ ఈ కంపెనీలు 40 అంగుళాలు మరియు 43 అంగుళాల స్మార్ట్ టీవీలను కొంచెం ఎక్కువ ధరలకు లాంచ్ చేస్తున్నాయి.

List Of 43 inches SmartTvs You Can Buy Under Rs.16000. Price And Specifications Details.

అయితే, భారతదేశంలోని మరికొన్ని కంపెనీలు నాణ్యమైన 40-అంగుళాల మరియు 43-అంగుళాల స్మార్ట్ టీవీలను తక్కువ ధరలోనే బడ్జెట్ ప్రియులకు అనుకూలంగా లాంచ్ చేస్తున్నాయి. అలాంటి వాటిలో, రూ.16,000 లోపు మార్కెట్లో లభించే 40 అంగుళాలు మరియు 43 అంగుళాల స్మార్ట్ టీవీలను ఒక్కసారి పరిశీలిద్దాం.

ఇన్ఫినిక్స్ 43Y1 స్మార్ట్ టీవీ

ఇన్ఫినిక్స్ 43Y1 స్మార్ట్ టీవీ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999 ధర కి అందుబాటులో ఉంది. ఇంకా, ఈ స్మార్ట్ టీవీని ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ఆఫర్లతో మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

List Of 43 inches SmartTvs You Can Buy Under Rs.16000. Price And Specifications Details.

ఇన్ఫినిక్స్ 43Y1 స్మార్ట్ TV పూర్తి HD LED డిస్ప్లే డిజైన్‌తో వస్తుంది. ఇది 1,920x1,080 పిక్సెల్‌లు, 300 నిట్స్ బ్రైట్‌నెస్‌తో సహా అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఇన్ఫినిక్స్ 43Y1 మోడల్ Mali-G31 GPU మద్దతుతో క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. కాబట్టి ఈ స్మార్ట్ టీవీ చూడటానికి అందంగా ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ టీవీలో 4GB స్టోరేజీ ఆప్షన్ కూడా ఉంది. అద్భుతమైన ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20 వాట్స్ బాక్స్ స్పీకర్‌లతో వస్తుంది. కాబట్టి ఇది మంచి ఆడియో అనుభూతిని అందిస్తుంది. మీరు ఈ స్మార్ట్ టీవీలో యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జీ5, ఈరోస్ నౌ, హంగామాతో సహా అనేక యాప్‌లను ఉపయోగించవచ్చు. ఈ ఇన్ఫినిక్స్ 43Y1 స్మార్ట్ టీవీలో Wi-Fi, LAN, HDMI పోర్ట్, USB పోర్ట్, AV ఇన్‌పుట్, హెడ్‌ఫోన్ జాక్ వంటి అనేక కనెక్టివిటీ సపోర్ట్‌లు ఉన్నాయి.

40-ఇంచుల కోడాక్ 7X ప్రో స్మార్ట్ టీవీ

40-ఇంచుల కోడాక్ 7X ప్రో స్మార్ట్ టీవీ ఫుల్ HD LED ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,999 కి అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీలో 24 వాట్స్ స్పీకర్స్ ఉన్నాయి. కాబట్టి మీరు మంచి ఆడియో అనుభూతిని కలిగి ఉంటారు. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే, ఈ 40-అంగుళాల కోడాక్ 7X ప్రో స్మార్ట్ టీవీలో ARM Cortex-A53 ప్రాసెసర్, 1GB RAM, 8GB స్టోరేజ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. తరువాత, ఈ 40-అంగుళాల కోడాక్ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్, Wi-Fi సపోర్ట్, HDMI పోర్ట్, USB పోర్ట్ మరియు ఇతర ఫీచర్లతో పరిచయం చేయబడింది.

List Of 43 inches SmartTvs You Can Buy Under Rs.16000. Price And Specifications Details.

TCL నుంచి 40-అంగుళాల iFFALCON స్మార్ట్ టీవీ

40-అంగుళాల iFFALCON టీవీ ఫుల్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.15,999 కి అందుబాటులో ఉంది. అయితే మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌ల ఆఫర్ల ద్వారా మరింత తక్కువ ధరకు ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీలో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. అలాగే, ఈ TCL స్మార్ట్ టీవీ లో 20 వాట్స్ స్పీకర్లు, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ సపోర్ట్, 1GB RAM, HDR సపోర్ట్, Wi-Fi సపోర్ట్, HDMI పోర్ట్, USB పోర్ట్ వంటి అనేక గొప్ప ఉన్నాయి.

43-ఇంచుల VW ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ

ప్రస్తుతం, 43-ఇంచుల VW ఆండ్రాయిడ్ టీవీ ధర అమెజాన్‌లో రూ.15,999 కి అందుబాటులో ఉంది. అయితే మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌ల ఆఫర్లను ఉపయోగించి మరింత తక్కువ ధరకు ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా క్వాడ్-కోర్ ప్రాసెసర్, HDR10 సపోర్ట్, 20 వాట్స్ స్పీకర్లు, ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫాం, HDMI పోర్ట్, USB పోర్ట్, వై-ఫై సపోర్ట్, LAN సపోర్ట్ వంటి అనేక ముఖ్యమైన ఫీచర్లను కలిగి ఉంది.

40-ఇంచుల క్యాండెస్ స్మార్ట్ టీవీ

ప్రస్తుతం ,40-ఇంచుల క్యాండెస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV మోడల్ అమెజాన్‌లో ధర రూ.14,490 కి అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీ 1GB RAM, 8GB స్టోరేజ్, 24 వాట్స్ స్పీకర్లు, HDMI పోర్ట్, USB పోర్ట్. ముఖ్యంగా, ఇది Wi-Fi మద్దతుతో సహా అనేక ప్రత్యేక ఫీచర్లను అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
List Of 43 inches SmartTvs You Can Buy Under Rs.16000. Price And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X