జూలై 2023 నెలలో లాంచ్ కాబోతున్న, టాప్ బ్రాండ్ల 5G ఫోన్ల లిస్ట్! వివరాలు
జూలై మొదటి వారం పూర్తిగా స్మార్ట్ ఫోన్ లాంచ్ లు షెడ్యూల్ చేయబడ్డాయి, ఎందుకంటే భారతదేశంలో వచ్చే వారం అనేక 5G ఫోన్‌లు లాంచ్ చేయడానికి ప్రముఖ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. వీటిలో శాంసంగ్ గెలాక్సీ M34 జూలై 7న లాంచ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. అలాగే, నథింగ్ ఫోన్ (2) జూలై 11న వస్తుంది.
ఇంకా, వన్ ప్లస్ Nord 3, iQOO నియో 7 ప్రో మరియు రియల్ మీ నార్జో 60 సిరీస్ వంటి ఇతర ప్రసిద్ధ ఫోన్‌లు కూడా రాబోయే వారాల్లో లాంచ్ అవుతాయని ప్రకటించారు. టాప్ ఎండ్ ఫీచర్‌లతో విభిన్న ధరల విభాగాల్లో వ్యక్తులు మరిన్ని ఆప్షన్లని కలిగి ఉంటారు. భారతదేశంలో వచ్చే నెలలో లాంచ్ కానున్న ఉత్తమ 5G ఫోన్‌ల లిస్ట్ మరియు వాటి స్పెసిఫికేషన్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Samsung Galaxy M34 జూలై 7న భారతదేశంలో లాంచ్ అవుతుంది
శాంసంగ్ యొక్క కొత్త గెలాక్సీ M సిరీస్ ఫోన్ 120Hz డిస్‌ప్లే తో వస్తుంది. 6,000mAh బ్యాటరీ మరియు 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని శాంసంగ్ ఇప్పటికే ధృవీకరించింది. ఇది, 6.6-అంగుళాల FHD+ సూపర్ AMOLED స్క్రీన్‌తో వస్తుందని మరియు మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్ తో, 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు మద్దతునిస్తుందని తెలుస్తోంది. అంచనాల ప్రకారం దీని ధర రూ. 20,000 సెగ్మెంట్‌లో ఉంటుందని పేర్కొన్నారు.
నథింగ్ ఫోన్ (2) జూలై 11న భారతదేశంలో లాంచ్ చేయబడుతుంది
ఈ కొత్త 5G ఫోన్ క్వాల్కమ్ యొక్క టాప్ ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్ ద్వారా అందించబడుతుందని నథింగ్ ఫోన్ (2) ధృవీకరించబడింది. ఇది 6.7 అంగుళాల స్క్రీన్, 4,700mAh బ్యాటరీ మరియు కొత్త లైట్/సౌండ్ సిస్టమ్‌తో వెనుకవైపు కొద్దిగా భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ కొత్త 5G ఫోన్‌లో గ్లిఫ్ కంపోజర్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.నథింగ్ ఫోన్ (2) భారతదేశంలో రూ. 40,000 నుండి రూ. 45,000 మధ్య ఉండవచ్చని అంచనాలున్నాయి.
వన్ ప్లస్ నోర్డ్ 3 భారత మార్కెట్లో జూలై 5న లాంచ్ అవుతుంది
ఇంతవరకు లీక్ అయిన వివరాల ప్రకారం, వన్ ప్లస్ నోర్డ్ 3 ఫోన్, 1.5K రిజల్యూషన్ 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది దాదాపు 6.74 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9000 SoC ఉండవచ్చు. వెనుకవైపు, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను చూడగలము. ఇది 8-మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ కెమెరాతో కూడి ఉంటుంది. ముందు భాగంలో, 5G ఫోన్ 16-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్లో 5,000mAh బ్యాటరీని చూడవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో వస్తుంది. ఈ రాబోయే వన్ ప్లస్ నోర్డ్ 3 భారతదేశంలో రూ. 30,000 కంటే తక్కువ ధరలో లాంచ్ అవుతుందని అంచనాలున్నాయి.
రియల్ మీ నార్జో 60 సిరీస్ త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది
ఇప్పటివరకూ లీక్ అయిన నివేదికల ప్రకారం, రియల్ మీ రాబోయే నార్జో ఫోన్‌ను 1TB స్టోరేజ్‌తో లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ 5G ఫోన్‌లో వినియోగదారులు 2,50,000 కంటే ఎక్కువ ఫోటోలను నిల్వ చేయగలరని కంపెనీ పేర్కొంది. ఇంకా, రియల్ మీ నార్జో 60 5G స్మార్ట్ ఫోన్ 6.43-అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ 90Hz డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్ మరియు 64-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రావచ్చు. 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జర్ ని కలిగి ఉంటుందని లీక్‌లు పేర్కొన్నాయి.
iQOO నియో 7 ప్రో జూలై 4న భారతదేశంలో లాంచ్ కాబోతోంది
iQOO నియో 7 ప్రో 6.78-అంగుళాల FHD+ Samsung E5 AMOLED డిస్‌ప్లేతో వస్తుందని చెప్పబడింది. ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్‌ను ప్యాక్ చేస్తుందని చెప్పబడింది. ఇది 12GB RAM మరియు 256GB నిల్వతో రావొచ్చు. ఈ ఫోన్ వెనుకవైపు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్‌ని కలిగి ఉంటుంది. భారతదేశంలో రూ. 40,000 లోపు ధర ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications