ధర రూ.15 వేల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్, ఫీచర్లు
భారతదేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ రెండూ ప్రస్తుతం 5G సేవలను అందించడానికి పోటీ పడుతున్నాయి.ఇప్పటికే, చాలా నగరాల్లో 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే కొన్నేళ్లలో అన్ని పట్టణాలు,గ్రామాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావడం ఖాయం.
దీంతో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా భారత్‌లో ఎక్కువగా 5జీ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి . కొన్ని నెలల క్రితం వరకు కూడా 5జీ ఫోన్ లు కొనాలంటే ప్రారంభ ధర రూ.25 వేల కంటే ఎక్కువగా ఉండేది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుత మార్కెట్లో, రూ.13 వేల నుంచి కూడా 5జీ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఈ తక్కువ ధరలో కూడ కొన్ని స్మార్ట్‌ఫోన్ తయారీదారులు మెరుగైన ఫీచర్లను అందిస్తున్నారు. కాబట్టి రూ.15,000 వేల లోపు మంచి కెమెరా, బ్యాటరీ, ర్యామ్, స్టోరేజ్‌తో సహా కీలక ఫీచర్లను కవర్ చేసే టాప్ 5 5G ఫోన్‌ల వివరాలు ఇక్కడ చూడండి.
శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫీచర్లు: 6.6 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్ప్లే. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వచ్చే ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 13 Exynos 1330 (5nm) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజ్, 4GB RAM మరియు 128GB స్టోరేజ్ మరియు 6GB RAM - 128GB స్టోరేజ్ అనే మూడు వేరియంట్లలో వస్తుంది.
ఇంకా, 6,000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రోతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. నేవీ బ్లూ, లైట్ బ్లూ, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. ఈ 5G ఫోన్ ప్రారంభ ధర రూ.14,990 గా నిర్ణయించబడింది.
పోకో M4 ప్రో 5G ఫీచర్లు: ఈ ఫోన్ 6.6 అంగుళాల పూర్తి HD+ డిస్ప్లే. ఆండ్రాయిడ్ 12 మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో వస్తుంది.ఇందులో 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ఉంది. 50 MP ప్రధాన కెమెరా మరియు 16 MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5,000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇక ఈ ఫోన్ యొక్క ధర విషయానికొస్తే, ఇది రూ.14,999 ధర కు అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫీచర్లు: ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్ప్లే. ఆండ్రాయిడ్ 12 మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో వస్తుంది. 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ఉంది. 50MP ప్రధాన కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఇందులో ముఖ్యమైన ఫీచర్లు. 5,000mAh బ్యాటరీ 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ధర విషయానికొస్తే, ఇది రూ.12,999గా నిర్ణయించబడింది.
రెడీమి 11 ప్రైమ్ 5G ఫీచర్లు: 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB నిల్వతో వస్తుంది. 50 MP ప్రధాన కెమెరా మరియు 8 MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 5000 mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.13,249గా నిర్ణయించబడింది. మేడో గ్రీన్, క్రోమ్ సిల్వర్, థండర్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.
రియల్ మీ నార్జో 50 ఫీచర్లు: 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 4GB RAM మరియు 128GB స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 11 మీడియా టెక్ హీలియో G96 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. 50 MP ప్రధాన కెమెరా మరియు 16 MP సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. 5000 mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.14,999గా నిర్ణయించబడింది. రంగులు అందుబాటులో ఉన్నాయి. స్పీడ్ బ్లూ మరియు స్పీడ్ బ్లాక్ రంగులలో లభిస్తుంది.


Click it and Unblock the Notifications