తక్కువ ధరలో బెస్ట్ 5G ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ ఫోన్లు చూడండి !
భారతదేశంలో ప్రముఖ టెలికామ్ సంస్థలైన ఎయిర్టెల్ మరియు జియో లు 5G సేవలను అన్ని ప్రముఖ నగరాలలో ఇప్పటికే ప్రారంభించాయి. ప్రజలు 5G సేవలను ఉపయోగించడం కూడా ప్రారంభించారు. అదేవిధంగా సెల్ ఫోన్ కంపెనీలు కూడా పోటీ పడి మరీ 5జీ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ధరల్లో 5జీ ఫోన్లను ప్రవేశపెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

బడ్జెట్ ధర ఫోన్లకు మార్కెట్ కూడా ఎక్కువ
అంటే రియల్ మీ, పోకో, మోటో వంటి కొన్ని కంపెనీలు బడ్జెట్ ధరలలోనే ఫోన్‌లను లాంచ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. ఎందుకంటే ఈ బడ్జెట్ ధర ఫోన్లకు మార్కెట్ కూడా ఎక్కువ ఉంది. సరే అయితే, ఇప్పుడు విషయానికి వద్దాం. కాబట్టి ఇప్పుడు ఈ బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను పరిశీలిద్దాం.

పోకో M4 5G
ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB స్టోరేజ్‌తో అమెజాన్‌లో రూ. 12,999 ధరకు అందుబాటులో ఉంది. ఇంకా, ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీరు మరిన్ని అదనపు ఆఫర్ల ప్రయోజనాలను పొందుతారు. పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ వాడటానికి చాలా బాగుంది. అలాగే ఈ పోకో M4 5G ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ F23 5G
శాంసంగ్ గెలాక్సీ F23 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో అమెజాన్‌లో రూ.15,999 ధర కి అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫోన్‌లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని సహాయంతో మీరు అద్భుతమైన ఫోటోలను తీయవచ్చు. అలాగే, ఈ గెలాక్సీ F23 5G ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే, 5000 mAh బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 750G చిప్‌సెట్, 8MP సెల్ఫీ కెమెరా వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

ఐక్యూ Z6 లైట్
ఐక్యూ Z6 లైట్ స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్‌తో వస్తుంది. అమెజాన్‌లో రూ.13,999 కి ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ 5G ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 4 Gen 1 చిప్‌సెట్ అమర్చబడింది. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన పనితీరును అందిస్తుంది. అలాగే, ఈ ఐక్యూ Z6 లైట్ 5G ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 50MP వెనుక కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు మెరుగైన భద్రతా ఫీచర్లతో వస్తుంది.

రెడ్ మీ 11 ప్రైమ్ 5G
రెడ్ మీ 11 ప్రైమ్ 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజీతో అమెజాన్‌లో రూ. 13,999 ధరకు అందుబాటులో ఉంది. అలాగే, ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి మరింత అదనపు ఆఫర్ల ద్వారా మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రెడ్ మీ 11 ప్రైమ్ 5G స్మార్ట్‌ఫోన్ 6.58-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇక ఈ రెడ్ మీ 11 ప్రైమ్ 5G ఫోన్‌లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్ వంటి అనేక ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి.

మోటోరోలా G62 5G
మోటోరోలా G62 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో ఫ్లిప్కార్ట్ లో రూ.14,999 కి అందుబాటులో ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ మోటరోలా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్ మరియు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ వాడటానికి చాలా వేగవంతంగా ఉంటుంది. అలాగే, ఈ మోటోరోలా G62 5G ఫోన్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, 6.55-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే, 5000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది.


Click it and Unblock the Notifications