నవంబర్ తొలివారంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్... టాబ్లెట్స్!
మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2 (ఫాబ్లెట్), ఏ90ఎస్ (స్మార్ట్ ఫోన్) (Micromax A110 Canvas 2 phablet and A90S Pixel smartphone):

అంబారాన్నంటే దీపావళి సంబరాలను పురస్కరించుకుని ప్రముఖ మొబైల్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ఆండ్రాయిడ్ వోఎస్ ఆధారితంగా స్పందించే రెండు సరికొత్త మొబైలింగ్ గ్యాడ్జెట్‌లను అందుబాటులోకి తెచ్చింది. మైక్రోమ్యాక్స్ ‘ఏ110 సూపర్ ఫోన్ కాన్వాస్2’, ‘ఏ90ఎస్ సూపర్ ఫోన్ పిక్సల్’ మోడళ్లలో రిటైల్ మార్కెట్లోకి రంగప్రవేశం చేసిన ఈ డివైజ్‌లలో మొదటిది ఫాబ్లెట్ రెండవది స్మార్ట్‌ఫోన్. ఈ డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌ల స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా….
బరువు ఇంచా చుట్టుకొలత………
కాన్వాస్ 2: చుట్టుకొలత 147 x 76.5 x 9.7మిల్లీ మీటర్లు, బరువు 168 గ్రాములు,
ఏ90ఎస్: చుట్టుకొలత 127.2 x 66.8 x 9.8మిల్లీ మీటర్లు, బరువు 118 గ్రాములు,
డిస్‌ప్లే…….
కాన్వాస్ 2: 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
ఏ90ఎస్: 4.3 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ప్రాసెసర్…..
కాన్వాస్ 2: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఏ90ఎస్: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం……
కాన్వాస్ 2: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ఏ90ఎస్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా……
కాన్వాస్ 2: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
ఏ90ఎస్: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
స్టోరేజ్……..
కాన్వాస్ 2: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఏ90ఎస్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ……
కాన్వాస్ 2: 3జీ, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై,
ఏ90ఎస్: 3జీ, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై,
బ్యాటరీ…….
కాన్వాస్ 2: 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై టైమ్),
ఏ90ఎస్: 1600ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 5 గంటలు, స్టాండ్ బై టైమ్ 174 గంటలు),
ధర ఇంకా ఇతర వివరాలు…..
కాన్వాస్ 2: ధర రూ.9,990, కలర్ వేరియంట్స్ బ్లాక్ ఇంకా వైట్.
ఏ90ఎస్: ధర రూ.12,990, కలర్ వేరియంట్స్ బ్లాక్ ఇంకా వైట్.


Click it and Unblock the Notifications