ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు..టాబ్లెట్‌లు!
ఎస్ హువావీ ఎసెండ్ వై100 (S Huawei Ascend Y100):

సెప్టంబర్ 2012, ఐఎఫ్ఏ ఎగ్జిబిషన్‌లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్ధ హువావీ టెక్నాలజీస్ ఆరు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వాటిలో ఒకటైన ప్రాధమిక స్ధాయి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘ఆసెండ్ వై100’ను దేశీయ మార్కెట్లో స్పైస్-హువావీలు సుంయుక్తంగా విడుదల చేసాయి. ‘ఎస్ హువావీ ఆసెండ్ వై100’ మోడల్‌లో విడుదలైన ఈ డివైజ్ ధర ఇంకా ఇతర ఫీచర్లు వివరాలు……
- 10.1 మిల్లీమీటర్ల మందం, బరువు 100 గ్రాములు,
- 2.8 అంగుళాల 262కే కలర్ టీఎఫ్‌టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే(రిసల్యూషన్ సామర్ధ్యం 320 × 240పిక్సల్స్),
- ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
- 800 మెగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్7225ఏ ప్రాసెసర్,
- 3.2 మెగాపిక్సల్ కెమెరా,
- 3జీ హెచ్‌ఎస్‌పీఏ 7.2ఎంబీపీఎస్, వై-ఫై 802.11బి/జి/ఎన్,
- బ్లూటూత్ వీ2.1+ఈడిఆర్, జీపీఎస్/ఏజీపీఎస్,
- 256ఎంబీ ర్యామ్, 512ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,
- 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
- ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
- 1050ఎమ్ఏహెచ్ బ్యాటరీ (స్టాండ్‌బై 300 గంటలు, టాక్‌టైమ్ 300 నిమిషాలు).
ధర ఇతర వివరాలు:
ఎస్ హువావీ ఆసెండ్ వై100ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘సాహోలిక్ డాట్ కామ్’ రూ.5,990కి ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








