ఈ నెల December లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే ! వివరాలు చూడండి.

By Maheswara
|

2021 లో చివరి నెలకు వచ్చేసాము.ఈ సంవత్సరం లో చాలా స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి మరి కొన్ని వాయిదా పడ్డాయి. ఇక ఈ సంవత్సరం లో లాంచ్ చేయడానికి ఈ ఒక్క నెల గడువు మాత్రమే మిగిలింది. అందుకే ఈ నెల, డిసెంబర్ లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. Realme GT 2 Pro మరియు Xiaomi 12 వంటి ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCతో లాంచ్ అవుతున్నట్లు ధృవీకరించబడినప్పటికీ, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు చాలా లాంచ్ అవుతాయని తెలుస్తోంది.

డిసెంబర్ 2021లో లాంచ్

Micromax In Note 1 Pro మరియు Redmi Note 11T వంటి ఫోన్‌లు కూడా డిసెంబర్ 2021లో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. డిసెంబర్ 2021లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాము గమనించండి.

OnePlus 9RT

OnePlus 9RT

Oneplus నుంచి లేటెస్ట్ గా రాబోతున్న OnePlus RT స్మార్ట్ఫోన్ ఈ నెలలోనే లాంచ్ కాబోతున్నట్లు రిపోర్టులు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ లను గమనిస్తే, 6.62-అంగుళాల (1080 x 2400 పిక్సెల్‌లు) పూర్తి HD+ 397 ppi 20:9 ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 888 5nm మొబైల్ ప్లాట్‌ఫారమ్ అడ్రినో 660 GPU, 8GB LPDDR5 RAMతో 128GB స్టోరేజీ ) ColorOS 12తో Android 12 నిల్వ, డ్యూయల్ సిమ్ (నానో + నానో) మరియు కెమెరా విషయానికి వస్తే  50MP + 16MP + 2MP వెనుక కెమెరా 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE 4,500 mAh బ్యాటరీ వస్తుందని తెలుస్తోంది.

Moto G200

Moto G200

మోటోరోలా నుంచి G సిరీస్ ఫోన్లను చాలా తక్కువ సమయం లో లాంచ్ చేస్తోంది. ఇటీవలే Moto G31 లాంచ్ అయిన విషయం తెలిసిందే. మరియు ఈ నెలలోనే Moto G51 మరియు Moto G200 కూడా లాంచ్ కాబోతున్నట్లు సమాచారం ఉంది. ఇక స్పెసిఫికేషన్లు చూస్తే , 6.8-అంగుళాల (2460 × 1080 పిక్సెల్‌లు) పూర్తి HD+ LCD స్క్రీన్ , ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 888+ 5nm మొబైల్ ప్లాట్‌ఫారమ్ అడ్రినో 660 GPU , 8GB LPPDDR5 ర్యామ్‌తో 128GB (UFS 3.1) స్టోరేజ్, డ్యూయల్ సిమ్ , కెమెరా 16MP క్వాడ్ పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE , 5,000 mAh బ్యాటరీ ఉన్నాయి.

Micromax In Note 1 Pro

Micromax In Note 1 Pro

Micromax నుంచి కూడా Micromax In Note 1 Pro కొత్త ఫోన్ లాంచ్ కాబోతోంది. 6.67 అంగుళాలు, 1080 x 2460 px డిస్‌ప్లే పంచ్ హోల్ తో, ఆండ్రాయిడ్ v11 64 MP క్వాడ్ రియర్ & 16 MP ఫ్రంట్ కెమెరా, 4 GB RAM, 64 GB ఇంటర్నల్ మెమొరీ కార్డ్,  5000mAh బ్యాటరీ తో రాబోతోందని అంచనాలున్నాయి.

Realme C35 ,Realme Narzo 50A Prime

Realme C35 ,Realme Narzo 50A Prime

ఇక ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ Realme విషయానికి వస్తే , Realme నుంచి Realme C35 ,Realme Narzo 50A Prime రెండు స్మార్ట్ఫోన్లు ఈ నెలలో లాంచ్ కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే. Realme C35 6.6 అంగుళాల IPS LCD స్క్రీన్, 4 GB RAM ,16 MP ప్రైమరీ కెమెరా + 5 MP కెమెరా + 2 MP కెమెరా 12 MP ప్రైమరీ కెమెరా, 6,000 mAh లి-పాలిమర్ బ్యాటరీ తో వస్తుంది. ఇక మరొక్క ఫోన్ Realme Narzo 50A Prime స్పెసిఫికేషన్ లు గమనిస్తే 6.5 అంగుళాల స్క్రీన్, ఆక్టా-కోర్ CPU , 50 MP + 2 MP + 2 MP వెనుక కెమెరా 8MP ఫ్రంట్ కెమెరా , 4 GB RAM 64GB / 128GB స్టోరేజ్ , నాన్-రిమూవబుల్ Li-Po 6,000 mAh బ్యాటరీ లు కలిగి ఉండవచ్చని అంచాలు
ఉన్నాయి.

iQOO 8 Legend

iQOO 8 Legend

iQOO 8 Legend అంచనా స్పెసిఫికేషన్లు , 6.78 అంగుళాల స్క్రీన్ ,స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్, 50 MP + 48 MP + 16 MP వెనుక కెమెరా 16 MP ఫ్రంట్ కెమెరా, 8 GB RAM 256 GB ఇంటర్నల్ మెమరీ మరియు 4,500 mAh బ్యాటరీ.

Xiaomi Redmi Note 11T 5G

Xiaomi Redmi Note 11T 5G

Xiaomi Redmi Note 11T 5G రెండు రోజుల క్రితమే లాంచ్ అయింది.త్వరలోనే అమ్మకాలు మొదలు కాబోతున్నాయి.ఇక ఫీచర్లు గమనిస్తే  6.6 అంగుళాల స్క్రీన్, Android 11, MIUI 12.5 OS ,ఆక్టా-కోర్ CPU , 64GB - 4GB RAM, 128GB - 6GB RAM, 128GB - 8GB RAM వేరియంట్ లలో వస్తుంది. 50 MP + 8MP వెనుక కెమెరా 16MP ఫ్రంట్ కెమెరాలు , Li-Po 5,000 mAh బ్యాటరీ తో వస్తుంది.

Motorola Moto G51 5G

Motorola Moto G51 5G

మోటోరోలా నుంచి G సిరీస్ ఫోన్లను చాలా తక్కువ సమయం లో లాంచ్ చేస్తోంది. ఇటీవలే Moto G31 లాంచ్ అయిన విషయం తెలిసిందే. మరియు ఈ నెలలోనే Moto G51 మరియు Moto G200 కూడా లాంచ్ కాబోతున్నట్లు సమాచారం ఉంది. ఇక స్పెసిఫికేషన్లు చూస్తే, 6.8-అంగుళాల IPS LCD స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 చిప్‌సెట్, 8GB RAM , 50MP + 8MP + 2MP వెనుక కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా , 5,000 mAh Li-పాలిమర్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

Xiaomi 12

Xiaomi 12

షియోమీ నుంచి కూడా Xiaomi 12 స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ కాబోతోన్నట్లు తెలుస్తోంది. ఇక స్పెసిఫికేషన్లు ను గమనిస్తే,  6.8-అంగుళాల AMOLED డిస్ప్లే, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్, 8GB RAM ద్వారా ఆధారితమైనది మరియు 128GB అంతర్గత నిల్వ, 108MP +13MP + 8MP + 5MP 32MP సెల్ఫీ కెమెరా మరియు 5,000 mAh బ్యాటరీని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
List Of Smartphones Expected To Launch In December 2021 . Here Are Expected Features.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X