ధర రూ.10000 లలోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్, ధరల వివరాలు
భారతదేశంలోని ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీలు బడ్జెట్ ధరలలో 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. అది కూడా ఈ బడ్జెట్ ధర కలిగిన 5G ఫోన్లు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. సరే ఇప్పుడు విషయానికి వస్తే, ప్రస్తుతం భారతదేశంలో రూ.10,000 లోపు ఉత్తమ 5G స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను పరిశీలిద్దాం.
Nokia G42 5G: నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM మరియు 128GB స్టోరేజీ తో అమెజాన్‌లో రూ.9,999 కి అందుబాటులో ఉంది. అదనంగా, ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.750 తగ్గింపు కూడా ఉంది. కాబట్టి మీరు ఈ ఫోన్‌ను రూ.9249 ధరతో కొనుగోలు చేయవచ్చు.

ఈ నోకియా G42 5G ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5G చిప్‌సెట్, అడ్రినో 619 GPU గ్రాఫిక్స్ కార్డ్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్, 6.56 అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ రియర్ కెమెరాలు, 8MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీతో, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.
Motorola G34 5G: మోటోరోలా G34 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,999 కి అందుబాటులో ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. కాబట్టి మీరు ఈ ఫోన్‌ను రూ.9,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.
ముఖ్యంగా, మోటోరోలా G34 5G ఫోన్ 6.5-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 5000mAh బ్యాటరీ, Dolby Atmos ఆడియో సపోర్ట్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు అనేక ఇతర గొప్ప ఫీచర్లతో వస్తుంది.
POCO M6 5G: ఈ ఫోన్ 6GB RAM మరియు 128GB స్టోరేజీతో POCO M6 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999 కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ, మీడియా టెక్ డైమెన్సిటీ 6100 Plus చిప్‌సెట్, 18 Watts ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం మరియు అనేక ఇతర గొప్ప ఫీచర్లు ఉన్నాయి.
Itel P55 5G : 4GB RAM మరియు 64GB స్టోరేజీ తో itel P55 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9,399 కి అందుబాటులో ఉంది. 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 50MP రియర్ కెమెరా, 5000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్, 18వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.
Lava Blaze 5G: 6GB RAM మరియు 128GB స్టోరేజీతో Lava Blaze 5G ఫోన్ అమెజాన్‌లో రూ.9,099 ధరకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్ లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 6.5-అంగుళాల HD Plus డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 700 చిప్ సెట్ సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.
Redmi 13C 5G : ఇక చివరగా, 4GB RAM మరియు 128GB స్టోరేజీ తో Redmi 13C 5G ఫోన్ అమెజాన్‌లో రూ.10,499 ధరకు అందుబాటులో ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు కూడా ఉంది. కాబట్టి మీరు ఈ ఫోన్‌ను రూ.9,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ, 6.74-అంగుళాల డిస్‌ప్లే, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, డైమెన్సిటీ 6100 ప్లస్ 5G చిప్‌సెట్‌తో వస్తుంది.


Click it and Unblock the Notifications








