ఈ నెల సెప్టెంబర్ లో లాంచ్ కాబోతున్న 5G ఫోన్లు ఇవే ! లిస్ట్ చూడండి.

By Maheswara
|

స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లు నెలనెలా కొనసాగుతున్నాయి.ఈ నెల సెప్టెంబర్ లో టాప్ బ్రాండ్ లు కొత్త తరానికి తగినట్లుగా 5G స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతున్నాయి. కరోనా మహమ్మారి లేదా గ్లోబల్ చిప్ కొరత ఉన్నప్పటికీ, స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లు ఈ సంవత్సరంలో చాలా వరకు కొనసాగాయి. ఇంకా, కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్నాయి. శామ్‌సంగ్, రియల్ మీ,Asus మరోయు షియోమి వంటి ప్రముఖ బ్రాండ్‌లు కొన్ని అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేయబోతున్నాయి. సెప్టెంబర్ 2021 లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌ల జాబితా గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ అందిస్తున్నాము.

 

సెప్టెంబర్  2021 నెలలో అనేక స్మార్ట్ ఫోన్ లాంచ్‌లు

సెప్టెంబర్  2021 నెలలో అనేక స్మార్ట్ ఫోన్ లాంచ్‌లు షెడ్యూల్ చేయబడ్డాయి. Realme 8s 5G నుండి Asus zenfone 8 వరకు, ఈ నెలలో భారతదేశంలో లాంచ్ అయ్యే సరసమైన ధర లో రాబోతోన్న 5G స్మార్ట్ ఫోన్ల జాబితా ఇక్కడ ఉంది. గమనించండి.

Samsung Galaxy A52s 5G

Samsung Galaxy A52s 5G

Samsung Galaxy A52s 5G ఈ రోజు సెప్టెంబర్ 1 న భారతదేశంలో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.35,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ.37,499, గా ఉంది. FHD+ Super AMOLED ప్యానెల్, 64MP క్వాడ్-కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 778 SoC, మరియు 4,500mAh బ్యాటరీ కలిగిన ఈ శామ్‌సంగ్ గెలాక్సీ A52s 5G ఫోన్ నేడు అంటే బుధవారం నుండి అమెజాన్, Samsung.com మరియు ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌ల నుండి బ్లాక్, వైలెట్ మరియు వైట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. HDFC బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వినియోగదారులు రూ.3000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

Asus Zenfone 8
 

Asus Zenfone 8

Asus 8Z లేదా మరో పేరుతొ పిలిచే Asus Zenfone 8, ఫ్లాగ్‌షిప్ మోడల్ ఈ నెలలో భారతదేశంలో విడుదల కానుంది. కాంపాక్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ మే నెలలో 5.9-అంగుళాల ఫుల్ HD+ 120Hz AMOLED డిస్‌ప్లే, 64MP డ్యూయల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 888 SoC మరియు 4,000mAh బ్యాటరీతో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది.ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన దాదాపు నాలుగు నెలల తరవాత ఇండియాలో లాంచ్ కాడం గమనించదగ్గ విషయం.

Redmi Note 10 Pro 5G

Redmi Note 10 Pro 5G

షియోమీ నుండి కూడా  రెడ్‌మి నోట్ 10 ప్రో 5 జి వెర్షన్ ఈ నెలలో భారతదేశంలో విడుదల కానుంది. ఈ ఫోన్ రూ.20,000 ధర బ్రాకెట్‌లో రావచ్చు. ఇంకా ఈ ఫోన్లోని స్పెసిఫికేషన్ లను గమనిస్తే, 6.6-అంగుళాల HDR10+ LCD డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1100 SoC, 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుందని అంచనాలున్నాయి.

Realme 8s 5G

Realme 8s 5G

Realme 8s 5G ఫోన్ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ షెల్ఫ్ నుండి వచ్చే 5G ఫోన్, ఈ నెలలో భారతీయ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ద్వారా శక్తినిస్తుంది మరియు 6.5-అంగుళాల 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 6GB/8GB ర్యామ్ ఆప్షన్ మరియు అదనపు 5G వర్చువల్ ర్యామ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ తో పాటుగా రియల్ మీ 8 సిరీస్ మరియు రియల్ మీ 9 సిరీస్ లోకూడా  ఫోన్లు కూడా లాంచ్ కాబోతున్నట్లు సమాచారం ఉంది.

Samsung Galaxy M32 5G

Samsung Galaxy M32 5G

ఈ నెలలో శాంసంగ్ నుంచి లాంచ్ కాబోతున్న రెండవ 5G ఫోన్ , శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G .ఈ ఫోన్ రూ. 25,000 ధర మార్జిన్ కిందకు వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 64MP ట్రిపుల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 778G SoC, 6GB RAM మరియు వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 7,000mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు అని అంచనాలున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
List Of Upcoming 5G Smartphone Launches In September In Indian Market.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X