రాబోయే నెల, మే 2023 లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు! ధర, స్పెసిఫికేషన్లు
ఇంకా ఏప్రిల్ నెల పూర్తి కాలేదు, కానీ ఇప్పటికే వచ్చే నెలలో ఎలాంటి స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయనే విషయం మరియు జాబితా తయారైంది. రియల్ మీ, గూగుల్, వన్ ప్లస్ మరియు ఇతర ప్రముఖ సంస్థల నుంచి రాబోయే ఫోన్ల లిస్ట్ ను ఇక్కడ గమనిద్దాం. మే 2023లో మొత్తం 5 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ చేయబడతాయి.
రియల్ మీ 11 ప్రో మరియు రియల్ మీ 11 ప్రో ప్లస్ : ఈ 2 కొత్త స్మార్ట్‌ఫోన్‌ల విడుదల ఈ సంవత్సరం మే లో జరుగుతుందని రియల్ మీ ఇప్పటికే ధృవీకరించినందున, రియల్ మీ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే వారు మరో కొన్ని రోజులు వేచి ఉండటం ఉత్తమం.

ఈ రెండు ఫోన్లూ కంపెనీ మధ్య శ్రేణి ఫోన్‌లు మరియు కొత్త మీడియా టెక్ డైమెన్సిటీ 7000 SoCని ప్యాక్ చేస్తాయి. ముఖ్యంగా, రియల్ మీ 11 ప్రో ప్లస్ మోడల్ 200MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ప్రో ప్లస్‌లో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 16MP సెల్ఫీ కెమెరా మరియు 80W లేదా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ కూడా ఉండవచ్చు. మరోవైపు ప్రో మోడల్‌లో 108MP కెమెరా, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉండవచ్చు.
ఇక ధర పరంగా చూస్తే, రియల్ మీ 11 ప్రో ప్లస్ ధర రూ. 34,990 వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే, రియల్ మీ 11 ప్రో ధర రూ. 28,999 వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, మే నెలలో ఖచ్చితమైన ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు.
గూగుల్ పిక్సెల్ 7a: ఈ జాబితాలోని మూడవ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 7a. మే 10న జరిగే గూగుల్ I/O ఈవెంట్‌లో దీనిని ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఇది గ్లోబల్ లాంచ్ అని చెప్పబడింది. ఫీచర్ల పరంగా, ఇది పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ కు పెద్ద అప్‌గ్రేడ్ గా ఉంటుంది. ఉదాహరణకు, పిక్సెల్ 7a స్మార్ట్‌ఫోన్ కొంచెం పెద్ద బ్యాటరీ, 90Hz డిస్‌ప్లే, గూగుల్ యొక్క కొత్త చిప్‌సెట్ మరియు మెరుగైన వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
అయితే,ఈ కొత్త గూగుల్ పిక్సెల్ 7A స్మార్ట్‌ఫోన్ ధర పాతదాని కంటే చాలా ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. పిక్సెల్ 7A స్మార్ట్‌ఫోన్ ధర అందుబాటులో ఉన్న ఫ్లాగ్‌షిప్, పిక్సెల్ 6Aతో పోలిస్తే దాదాపు రూ.7000 ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు రూ.50,999కి విడుదల చేయవచ్చు!
గూగుల్ పిక్సెల్ ఫోల్డ్: ఇక ఈ లిస్ట్ లో నాల్గవ ఫోన్ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్, గూగుల్ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఇది కూడా మే 10న జరగబోయే గూగుల్ I/O ఈవెంట్‌లోనే పరిచయం చేయబడుతుందని భావిస్తున్నారు.
గూగుల్ పిక్సెల్ ఫోల్డ్, ఫీచర్ల విషయానికొస్తే, ఇది 5.8-అంగుళాల డిస్‌ప్లే మడతపెట్టినప్పుడు 7.6-అంగుళాల డిస్‌ప్లేకి విస్తరిస్తుంది. మరియు ఇది టెన్సర్ G2 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర భారతీయ పరంగా రూ. 1,39,830 గా ఉండవచ్చని అంచనా. అంటే ఇది శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 4 కంటే ధర తక్కువగా ఉండవచ్చు.
వన్ ప్లస్ నోర్డ్ 3: ఈ లిస్ట్ మనం తెలుసుకోవాల్సిన చివరి ఫోన్ వన్ ప్లస్ నోర్డ్ 3. ఇది మే చివరిలో లేదా జూన్ ప్రారంభంలో లాంచ్ చేయబడవచ్చు. ఇది మిడ్‌రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్. ఈ ఏడాది లాంచ్ కానున్న బెస్ట్ నార్డ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుందని అంచనా.
ఈ ఫోన్ యొక్క ఫీచర్ల విషయానికొస్తే, ఇది 4,500mAh లేదా 5,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. దీనిలో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో FHD+ అమోలెడ్ డిస్‌ప్లే, OIS సపోర్ట్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ మొదలైన ఫీచర్లను తీసుకువస్తుంది. ఇక, ధర విషయానికొస్తే, దీనిని రూ. 27,999 వద్ద లాంచ్ చేయవచ్చు అని అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications








