ఐటీ అడ్డా హైదరాబాద్, టాప్ కంపెనీలు ఇవే

Posted By: BOMMU SIVANJANEYULU

గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, సిస్కో వంటి బహుళ జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ను లీడింగ్ డెస్టినేషన్‌గా ఎంపిక చేసకుని ఇక్కడ కూడా తమ కార్యకలాపాలను
సాగిస్తున్నాయి.

ఐటీ అడ్డా హైదరాబాద్, టాప్ కంపెనీలు ఇవే

హైదరాబాద్‌లో ఒక్క ఐటీ ఆధారిత సర్వీసులు మాత్రమే కాదు, బీపీఓ (బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్) ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందుతోంది. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీల దగ్గర నుంచి సాప్ట్‌వేర్ కన్సల్టింగ్ సంస్థల వరకు ఇటీ ఇంకా ఇతర టెక్నాలజీ సర్వీసుల పై ఆధారపడుతూ తమ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో 1990 నుంచి ఐటీ కంపెనీల హడావుడి మొదలైంది. అప్పటి నుంచే ఐటీ కంపెనీలు నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాయి. ఇన్ఫోసిస్ టెక్నాలజీ లిమిటెడ్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, డెల్, ఆమోజన్, ఒరాకిల్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ప్రముఖ కంపెనీలు భాగ్యనగరంలో ఏర్పాటయ్యాయి. లక్షల మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్‌లో కొలువుతీరిన టాప్ ఐటీ కంపెనీల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (Infosys technologies Limited)

భారతదేశపు ప్రముఖ బహుళజాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ బెంగళూరు ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. 1981లో ప్రారంభమైన ఈ సంస్థకు బెంగళూరుతో పాటు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రా, ఒడిస్సా ఇంకా పంజాబ్‌లలో కార్యాలయాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయం లింగంపల్లి ప్రాంతంలోని మానికొండ విలేజ్‌లో ఉంది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata consultancy Services)

భారతదేశపు ప్రముఖ బహుళజాతీయ ఐటీ కంపెనీలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముంబై ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. 1968లో ప్రారంభమైన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. అందులో హైదరాబాద్ క్యాంపస్ ఒకటి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్న ఐటీ, కన్సల్టింగ్ ఇంకా బిజినెస్ సర్వీసులు 46 దేశాల్లో ఆపరేట్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయం శేరు లింగంపల్లి ప్రాంతంలోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉంది.

గూగుల్ ఇంక్ (Google Inc)

అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ గూగుల్ హైదరాబాద్‌లోనూ తన కార్యాకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని మంటౌన్ వ్యూలో ఉంది. ఇంటర్నెట్ ఆధారిత సర్వీసులను ఆఫర్ చేయటంలో అగ్రగామి సంస్థగా అవతరించిన గూగుల్ ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ టెక్నాలజీస్, సెర్చ్, క్లౌడ్ కంప్యూటింగ్‌తో పాటు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ విభాగాల్లోనూ రాణిస్తోంది.

హైదరాబాద్‌లో ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయం కొండాపూర్ ప్రాంతంలో ఉంది.

సొనాటా సాఫ్ట్‌వేర్ (Sonata Software)

గ్లోబల్ ఐటీ సర్వీస్ కంపెనీలలో ఒకటైన సొనాటా సాఫ్ట్‌వేర్ బెంగుళూరు ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. 1986లో ఏర్పాటైన ఈ కంపెనీకి హైదరాబాద్‌లో కూడా క్యాంపస్ ఉంది. బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ఎనలిటిక్స్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, మొబిలిటీ, క్లౌడ్, సోషల్ మీడియా, టెస్టింగ్, ఎంటర్ ప్రైజ్ సర్వీసెస్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంట్ సర్వీసులను ఈ కంపెనీ ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్‌లో ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయం బేగంపేట ఏరియాలో ఉంది.

రూ. 6 వేలకే నోకియా 2, లీకేజి సంచలనం..

జెన్‌సార్ టెక్నాలజీస్ (Zensar Technologies)

ఐటీ సర్వీసులను ఆఫర్ చేస్తున్న ప్రముఖ ఇండియన్ కంపెనీలో జెన్‌సార్ టెక్నాలజీస్ ఒకటి. పూణే ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఈ కంపెనీని 1991లో ప్రారంభించారు. ఈ కంపెనీకి హైదరాబాద్‌లో కూడా క్యాంపస్ ఉంది.

మొబిలిటీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్, టెస్టింగ్ అండ్ ఎస్యూరెన్స్, ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, డిజిటల్ ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్ వంటి సర్వీసులను ఈ సంస్థ ఆఫర్ చేస్తుంది. హైదరాబాద్‌లో ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయం మాదాపూర్ ఏరియాలో ఉంది.

విప్రో (Wipro)

ఐటీ సర్వీసులను ఆఫర్ చేస్తున్న ప్రముఖ ఇండియన్ కంపెనీలో విప్రో ఒకటి. బెంగళూరు ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తోన్న ఈ కంపెనీని 1949లో ప్రారంభించటం జరిగింది. ఈ కంపెనీకి హైదరాబాద్‌లో కూడా క్యాంపస్ ఉంది. ఐటీ సర్వీసెస్‌తో పాటు ఐటీ కన్సల్టింగ్ సేవలను ఈ కంపెనీ ఆఫర్ చేస్తుంది. హైదరాబాద్‌లో ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయం గచ్చిబౌలి ఏరియాలో ఉంది.

ఒరాకిల్ (Oracle)

అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంప్యూటర్ టెక్నాలజీ కంపెనీ ఒరాకిల్ కార్పొరేషన్ హైదరాబాద్‌లోనూ తన కార్యాకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో ఉంది. డేటాబేస్ సాఫ్ట్‌వేర్ అండ్ టెక్నాలజీ, క్లౌడ్ ఇంజినీరింగ్ సిస్టమ్స్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను డెవలప్ చేయటంలో ఈ కంపెనీ దిట్ట. హైదరాబాద్‌లో ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయం హైటెక్ సిటీ ప్రాంతంలో ఉంది.

సిస్కో (Cisco)

అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ Cisco హైదరాబాద్‌లోనూ తన కార్యాకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో ఉంది. నెట్‌వర్కింగ్ హార్డ్‌వేర్, టెలీకమ్యూనికేషన్స్ ఎక్విప్‌మెంట్ ఇంకా హై-టెక్నాలజీ సర్వీసులకు సంబంధించి సర్వీసెస్ ఇంకా ప్రొడక్ట్స్‌ను ఈ కంపెనీ ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్‌లో ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయం బంజారా‌హిల్స్ ప్రాంతంలో ఉంది.

కాప్జెమిని (Capgemini)

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ Capgemini హైదరాబాద్‌లోనూ తన కార్యాకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం ప్యారిస్‌లో ఉంది. 1967లో ప్రారంభమైన ఈ కంపెనీ ఐటీ సర్వీసెస్‌తో పాటు ఐటీ కన్సల్టింగ్ సేవలను ఆఫర్ చేస్తుంది. హైదరాబాద్‌లో ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయం హైటెక్ సిటీ ప్రాంతంలో ఉంది.

మైక్రోసాఫ్ట్ (Microsoft)

అమెరికా చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ Microsoft హైదరాబాద్‌లోనూ తన ర్యాకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం వాషింగ్‌టన్‌లోని రెడ్మండ్ ప్రాంతంలో ఉంది. 1975లో ప్రారంభమైన ఈ కంపెనీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఇంకా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ పై దృష్టిసారిస్తోంది. హైదరాబాద్‌లో ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయం గచ్చిబౌలిలో ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
List of Top IT companies in Hyderabad. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot