ఫేస్‌బుక్ చేతికి బెంగుళూరు లిటిల్ ఐ ల్యాబ్స్

Posted By:

ఫేస్‌బుక్ చేతికి బెంగుళూరు లిటిల్ ఐ ల్యాబ్స్

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఇండియాలో తొలి కొనుగోలును పూర్తి చేసంది. సామాజిక సంబంధాల దిగ్గజం ఫేస్‌బుక్ తమ కంపెనీని కొనుగోలు చేసినట్లు లిటిల్ ఐ ల్యాబ్స్ తన అధికారిక వెబ్‌సైట్‌లో  పేర్కొంది.

బెంగుళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లిటిల్ ఐ ల్యాబ్స్‌ సంస్థ డెవలపర్స్ ఇంకా టెస్టర్ల కోసం మొబైల్ యాప్ టూల్స్‌ను తయారు చేస్తుంది. ఈ కంపెనీని మే 2012లో గిరిధర్ మూర్తి, కుమార్ రంగరాజన్ (కంపెనీ సీఈఓ), సత్యం కందుల, లక్ష్మణ్ కక్కిరాలాలు ప్రారంభించటం జరిగింది. తాజా కొనుగోలు నేపధ్యంలో లిటిల్ ఐ ల్యాబ్స్ బృందం ఇక పై కాలిఫోర్నియా, మెన్లో పార్క్‌లోని ఫేస్‍‌బుక్ ప్రధాన కార్యాలయంలో కార్యకలాపాలను సాగించనుంది. ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తొలి భారతీయ స్టార్ట్‌అప్‌గా లిటిల్ ఐ ల్యాబ్స్‌ చరిత్రలో నిలిచింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ తన మెసెంజర్ అప్లికేషన్‌ను అప్‌డేట్ చేస్తూ ‘అయిష్టత' (dislike) బటన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆప్షన్‌ను ప్రస్తుతానికి డెస్క్‌టాప్ ఇంకా మొబైల్ వర్షన్ ఫేస్‌బుక్ మెసెంజర్ అప్లికేషన్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని ఫాక్స్ న్యూస్ ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను యాక్సిస్ చేసుకునే క్రమంలో యూజర్లు మెసెంజర్ అప్లికేషన్‌లోని స్టిక్కర్ స్టోర్‌లోకి ప్రవేశించి డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot