ఇన్ఫోసిస్ గురించి ఆసక్తికర నిజాలు!

Posted By:

ఇన్ఫోసిస్ భారతదేశంలో పేరొందిన బహుళజాతి సాప్ట్‌వేర్ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది. ఇది భారతదేశంలోని అతి పెద్దఐటి కంపెనీల్లో ఒకటి. ఈ సంస్థకు భారతదేశంలో 9 డెవెలప్‌‌మెంట్ సెంటర్లు ఇంకా ఇతర దేశాల్లో 34 కార్యాలయాలు ఉన్నాయి. ఎన్ ఆర్ నారాయణ మూర్తి ఈ కంపెనీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు. బెంగళూరు లోని విస్తారమైన ఇన్ఫోసిస్ హైటెక్ ప్రాంగణం మీరు చూడాలనుకునే అద్భుత నిర్మాణం. బెంగళూరు లోని హోసూర్ రోడ్డులో ఎలెక్ట్రానిక్స్ సిటీ లో ఈ ప్రాంగణం వుంటుంది. 81 ఎకరాల సువిశాల ప్రాంగణం సజీవ నిర్మాణ శైలిని ఆస్వాదించే వారిని ఆహ్లాద పరుస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో ఇన్ఫోసిస్ గురించి మీకు తెలియని పలు ఆసక్తికర అంశాలను గిజ్‌బాట్ వెల్లడిస్తోంది.

ఆసక్తిక గాడ్జెట్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్పోసిస్ గురించి ఆసక్తికర నిజాలు!

1.) ఆరుగురు కాదు ఏడుగురు వ్యవస్థపాకులు:

వాస్తవానికి ఇన్ఫోసిస్‌ను స్ధాపించిన వ్యవస్థాపకుల సంఖ్య 7. అయితే ఈ సంఖ్య చాలామందికి 6గా తెలుసు. ఇన్ఫోసిస్ స్థాపనకు కృషిచేసిన 7గురు వ్యవస్థాపకుల పేర్లను క్రంది చూడొచ్చు.

- ఎన్ఆర్ నారాయణ మూర్తి,
- నందన్ నిల్కనీ,
- ఎస్ గోపాల్ క్రిష్ణన్,
- కె దినేష్,
- ఎన్ఎస్ రాఘవన్,
- ఎస్‌డి షిబులాల్,
- అశోక్ అరోరా.

ఈ ఏడుగురిలో ఒకరైన అశోక్ అరోరా 1988 వరకు ఇన్ఫోసిస్‌కు సేవలందించారు. తరువాతి క్రమంలో కంపెనీలోని తన మొత్తం షేర్లను ఇతర ప్రమోటర్లకు విక్రయించి అమెరికాకు వెళ్లిపోయారు.

 

ఇన్పోసిస్ గురించి ఆసక్తికర నిజాలు!

2.) ప్రస్తుత ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల సంఖ్య 4 మాత్రమే ఏడుగురుగా ఉన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల సంఖ్య ప్రస్తుతానికి నాలుగుకు చేరింది. కంపెనీ నుంచి ఇటీవల నిష్ర్కమించిన వారిలో నందన్ నిల్కనీ ఒకరు.

ఇన్పోసిస్ గురించి ఆసక్తికర నిజాలు!

3.) ఇన్ఫోసిస్ తన మొదటి అంతర్జాతీయ కార్యాలయాన్ని 1987లో యూఎస్‌లోని బోస్టన్‌లో ప్రారంభించింది.

ఇన్పోసిస్ గురించి ఆసక్తికర నిజాలు!

4.) కేవలం $250 మూలధనంతో ప్రారంభించబడిన ఇన్ఫోసిస్ 2008లో $4.18 బిలియన్ ఆదాయాన్ని అధిగమించగలిగింది.

ఇన్పోసిస్ గురించి ఆసక్తికర నిజాలు!

5.) దేశంలో రెండువ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫోసిస్ మొదటి రెండు సంవత్సరాల వరకు కంప్యూటర్ లేకుండానే సేల్స్ కార్యకలాపాలను నిర్వర్తించగలిగింది.

ఇన్పోసిస్ గురించి ఆసక్తికర నిజాలు!


6.) ఇన్ఫోసిస్ మొదటి నాన్-ఫౌండర్ ఉద్యోగిగా శరద్ హెడ్జి గుర్తింపుపొందారు.

ఇన్పోసిస్ గురించి ఆసక్తికర నిజాలు!

7.) ఇన్ఫోసిస్ 1992లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది. 1993లో ఇన్ఫోసిస్ ఐపీఓ విలువ రూ.96.

ఇన్పోసిస్ గురించి ఆసక్తికర నిజాలు!


8.) 1999లో ఇన్ఫోసిస్, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్స్‌లో తొలి రిజిస్టర్ కాబడిన ఇండియన్ సంస్థగా గుర్తింపుపొందింది.

ఇన్పోసిస్ గురించి ఆసక్తికర నిజాలు!

ఇన్ఫోసిస్ లక్షమంది ఉద్యోగులు కలిగిన భారతీయ సంస్థగా టీసీఎస్ తరువాతి స్థానంలో నిలిచింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot