క్యాబ్ డ్రైవర్ రేప్.. ఉబర్ పై నిషేధం (ఆసక్తికర వాస్తవాలు)

Posted By:

ప్రముఖ ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ సర్వీస్ ‘ఉబర్' పై ఢిల్లీలో నిషేధం విధించారు. ఓ 27 ఏళ్ల మహిళా ఎగ్జిక్యూటివ్ పై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఉబెర్ సంస్థకు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ దారుణాన్ని నిరసిస్తూ వివిధ ప్రజా సంఘాలు ఆందోళణలను ఉదృతం చేయటంతో ఢిల్లీలో ఉబెర్ సేవల పై ప్రభుత్వం నిషేధం విధించింది.

ఉబర్ గురించి క్లుప్తంగా...

ఉబర్.. ఇదొక ప్రముఖ ఆన్ డిమాండ్ ట్యాక్సీ బుకింగ్ మొబైల్ అప్లికేషన్. ఉబర్ టెక్నాలజీస్ సంస్థ ఈ యాప్‌ను డిజైన్ చేసింది. ఈ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపుతో మీకు కావల్సిన ప్రీమియం శ్రేణి కార్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఈ క్యాబ్ బుకింగ్ సర్వీస్ ప్రస్తుతం హైదరబాదీలకు అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. తొలత ఈ యాప్ సర్వీసును అమెరికాలో నాలుగు సంవత్సరాల క్రిందట ప్రారంభించారు. ఆ తరువాత, ప్రపంచవ్యాప్తంగా ఉబర్ సేవలు విస్తరించాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్యాబ్ డ్రైవర్ రేప్.. ఉబర్ పై నిషేధం (ఆసక్తికర వాస్తవాలు)

ముగ్గురు ఉద్యోగుల పాలసీ

ఉబర్ సేవలు ప్రస్తుతం దేశంలోని 10 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో నగరానికి ముగ్గురు డ్రైవర్లు ఉంటారు. భారత్‌లో ఉబర్ సంస్థకు 30 మంది ఉద్యోగులు ఉన్నారు.

 

క్యాబ్ డ్రైవర్ రేప్.. ఉబర్ పై నిషేధం (ఆసక్తికర వాస్తవాలు)

ఉబర్ సంస్థను శాన్‌ఫ్రాన్సిస్కోలో 2009లో ప్రారంభించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజి డ్రాపవుట్ ట్రావిస్ కల్నిక్ ఈ సంస్థను ప్రారంభించారు.

 

క్యాబ్ డ్రైవర్ రేప్.. ఉబర్ పై నిషేధం (ఆసక్తికర వాస్తవాలు)

కొత్త యూజర్లకు ఉబర్ ఉచిత ప్రయాణాలను ఆఫర్ చేస్తుంది.

క్యాబ్ డ్రైవర్ రేప్.. ఉబర్ పై నిషేధం (ఆసక్తికర వాస్తవాలు)

భారత్‌లో ఉబర్ సేవలు ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబయ్, పూణే, అహ్మదాబాద్, చంఢీఘడ్, జైపూర్, కోల్‌కతా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

 

క్యాబ్ డ్రైవర్ రేప్.. ఉబర్ పై నిషేధం (ఆసక్తికర వాస్తవాలు)

ఉబర్ తమ క్యాబ్ డ్రైవర్లకు ఉచిత ఐఫోన్‌లను ఇస్తుంది. అయితే ఈ ఫోన్‌లలో వాయిస్ కాలింగ్ లాక్ చేయబడుతుంది.

క్యాబ్ డ్రైవర్ రేప్.. ఉబర్ పై నిషేధం (ఆసక్తికర వాస్తవాలు)

ఎక్కడికి వెళ్లాలో ముందుగా చెప్పవల్సిన అవసరం లేదు. దిగిన తరువాత డ్రైవర్లకు ఏ విధమైన పేమెంట్ చెల్లించాల్సి అవసరం లేదు మొత్తం పేమెంట్ క్రెడిట్ కార్డ్ ద్వారానే జరిగిపోతుంది.

 

క్యాబ్ డ్రైవర్ రేప్.. ఉబర్ పై నిషేధం (ఆసక్తికర వాస్తవాలు)

ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ అప్లికేషన్ స్టోర్ నుంచి, బ్లాక్‌బెర్రీ యూజర్లు బ్లాక్‌బెర్రీ యాప్ వరల్డ్ నుంచి ఉబర్ అప్లికేషన్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
10 little-known facts about Uber. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot