ఈ కీబోర్డ్‌ను కడిగేస్తే పోలా!

Posted By: Staff

 ఈ కీబోర్డ్‌ను కడిగేస్తే పోలా!

‘మీకు తెలుసా.. కీబోర్డుపై నిర్ణీత పరిమితి కన్నా 150 రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుందట!’

సాధారణంగా కీబోర్డ్ పై నీళ్లు పడితే దాని పనితీరు మందగిస్తుంది. అయితే, ప్రముఖ కంప్యూటర్ విడిభాగాల తయారీ సంస్థ లాగిటెక్ తాజాగా రూపొందించిన వాటర్‌ప్రూఫ్ కీబోర్డ్ నీటిలో ముంచి లేపినా సమర్థవంతంగా పనిచేస్తుంది. దుమ్ము ఇతర బ్యాక్టీరియాల నుంచి దూరంగా ఉంచుకునేందుకు ఎప్పటికప్పుడు ఈ కోబోర్డ్‌ను నీటిలో ఇలా శుభ్రపరుచుకోవచ్చు. ఇందులో నీళ్లు పోవడానికి రంధ్రాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల తడి వెంటనే ఆరిపోతుంది కూడా.. లాగిటెక్ కంపెనీ ఈ కొత్త కీబోర్డ్ కు ‘కే310’గా నామకరణం చేసింది. బుధవారం మార్కెట్లోకి విడుదలైన ఈ గ్యాడ్జెట్ ధర రూ.3000.

ఒకే మౌస్‌తో నాలుగు కంప్యూటర్లు పనిచేస్తాయ్!

ఒక్క మౌస్‌తో నాలుగు కంప్యూటర్‌లను ఆపరేట్ చెయ్యటం సాధ్యమేనా..? mouse without borders (మౌస్ వితవుట్ బోర్డర్స్) సాఫ్ట్‌వేర్‌తో ఈ ప్రక్రియ సాధ్యమే. ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో కేవలం మౌస్‌ను మాత్రమే కాదు కీబోర్డ్‌ను నాలుగైదు పీసీలకు అనుసంధానించుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడింగ్ పూర్తిగా ఉచితం. అదనపు హార్డ్‌వేర్ అవసరం లేదు. సాఫ్ట్‌వేర్‌ను పీసీల్లో ఇన్‌స్టాల్ చేసి సూచనలను పాటిస్తే సరి. ఈ అత్యాధునిక పరిజ్ఞానం సాయంతో ఒకే మౌస్, ఒకే కీబోర్డును నాలుగు కంప్యూటర్లకు షేర్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot