విండోస్ 8 యూజర్‌ల కోసం లాగిటెక్ సరికొత్త ఉపకరణాలు!

By Prashanth
|
Logitech


ప్రముఖ విడిభాగాల తయారీ సంస్ధ లాగిటెక్(Logitech), విండోస్ 8 యూజర్‌ల కోసం సరికొత్త ఉపకరణాలను అందుబాటులోకి తెచ్చింది. విడుదలైన కొత్త ఉత్పత్తుల్లో ‘వైర్‌లెస్ రీచార్జబుల్ టచ్‌ప్యాడ్ టీ650’, ‘టచ్ మౌస్ టీ620’, ‘జోన్ టచ్ మౌస్ 400’, ‘బ్లూటూత్ ఇల్యూమినేటెడ్ కీబోర్డ్ కె810’, ‘వైర్‌లెస్ టచ్ కీబోర్డ్ కె400ఆర్’లు ఉన్నాయి. ఔత్సాహికులు వీటిని లాగిటెక్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయించవచ్చు. ఈ ఉపకరణాలు ఆవిష్కరణ సందర్భంగా లాగిటెక్ ఇండియా కంట్రీ మేనేజర్ బిస్వాస్ పాత్రికేయులతో మాట్లాడుతూ విండోస్ 8 యూజర్ల కోసం తాము ప్రత్యేకంగా రూపొందించిన ఉపకరణాలు అత్యుత్తమ కంప్యూటింగ్ అనుభూతులను చేరువచేస్తాయి.

 

ధరలు:

కెబి10 బ్లూటూత్ కీబోర్డ్ (ఒకేసారి మూడు డివైజ్‌లకు కనెక్ట్ చేసకోవచ్చు): ధర రూ.8295,

 

3.5 అంగుళాల టచ్‌‌ప్యాడ్‌తో కూడిన కె400 వైర్‌లెస్ టచ్‌కీబోర్డ్ : ధర రూ.2995,

టీ650 రీచార్జబుల్ టచ్‌ప్యాడ్, గ్లాస్ సర్‌ఫేస్ ఇంకా గెస్ట్యర్ కంపాటీబులిటీ: ధర రూ.4,995,

లాగిటెక్ టచ్ మౌస్ టీ620: ధర రూ.4295,

టీ400 జోన్‌టచ్ మౌస్: ధర రూ.2895.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X