Loksabha Election Results 2024 రేపే దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు.. ఫలితాలను ఎక్కడ చూడాలి.. పూర్తి వివరాలు..!
దేశవ్యాప్తంగా 7 విడతల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. లోక్ సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు సహా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ( Lok sabha Election Results 2024) రేపు ఉదయం (జూన్ 4) 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫలితాలపై దేశ ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలు ఉండగా.. సూరత్ మరియు ఇండోర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
7 విడతల్లో పోలింగ్. రేపు రిజల్ట్ :
తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 19 న, రెండో విడత ఏప్రిల్ 26, మూడో దశ మే 7, నాలుగో దశ మే 13, ఐదో విడత మే 20, ఆరో విడత మే 25న, ఏడో విడత జూన్ 1న ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి.

భారీ భద్రతా ఏర్పాట్లు :
ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసింది. అధికారులు కూడా లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.
లైవ్ ఎక్కడ చూడాలి :
ఎన్నికల ఫలితాలను తెలియజేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. http://results.eci.gov.in వెబ్ సైట్ ద్వారా లైవ్ అప్ డేట్స్ పొందవచ్చు. ఈ వెబ్ సైట్‌ల ద్వారా ఫలితాల ట్రెండ్‌ను తెలుసుకొనేందుకు అవకాశం కల్పించింది. దీంతోపాటు ఓటర్ యాప్ లోనూ ఎన్నికల ఫలితాలతోపాటు ఇతర సంబంధిత సమాచారం తెలుసుకొనేందుకు ఏర్పాట్లు చేసింది.
ఎన్నికల సంఘం అధికారిక ప్లాట్‌ఫాం లతోపాటు దేశవ్యాప్తంగా అన్ని న్యూస్ ఛానళ్లు సహా వారి యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ఛానళ్ల ద్వారా ఎన్నికల ఫలితాలను తెలుసుకోవచ్చు. రేపు ఉదయం నుంచే ఇందుకు సంబంధించిన అప్ డేట్స్ సహా విశ్లేషణ లను పొందవచ్చు.
అయితే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో జూన్ 2 తో ప్రభుత్వ గడువు ముగియడంతో ముందస్తుగా లెక్కింపు చేపట్టారు. సిక్కింలో సిక్కిం క్రాంతికార మోర్చా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ 32 స్థానాలకు గానూ 31 సీట్లు గెలుచుకొని రికార్డు సృష్టించారు. అరుణాచల్‌ప్రదేశ్ లో మొత్తం 60 సీట్లకు గానూ 46 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటి కప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications