లండన్ ఒలంపిక్స్.. గుగూల్ స్పెషల్ డూడుల్!

Posted By: Prashanth

లండన్ ఒలంపిక్స్.. గుగూల్ స్పెషల్ డూడుల్!

 

లండన్ 2012 ఒలంపిక్స్‌లో భాగంగా నాలుగో రోజును పురస్కరించుకుని గుగూల్ సాము విద్య (ఫెన్సింగ్ క్రీడ)తో కూడిన ఒలంపిక్ డూడుల్‌ను తన హోమ్ పేజ్ పై పోస్ట్ చేసింది. సాము విద్యలో ఆరితేరిన ఇద్దరు క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్న తీరును ఈ డూడుల్‌లో ప్రతిభింబించారు. ఒలంపిక్ క్రీడల ప్రారంభం నాటి నుంచి గుగూల్ రోజుకో ప్రత్యేకతతో ఒలంపిక్ క్రీడల పట్ల స్పూర్తిని నింపే ప్రయత్నం చేస్తోంది. క్రీడల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం ‘డైవింగ్ ఒలంపిక్ డుడూల్’ను పోస్ట్ చేసి స్విమ్మింగ్ ప్రియులను అబ్బురపరిచింది.

లండన్‌లో జరుగుతున్న 30వ ఒలింపిక్ క్రీడలు 19 రోజుల పాటు జరగనున్నాయి. పోటీలో జరిగే క్రీడాంశాల సంఖ్య 26, పాల్గొనున్న క్రీడాకారులు సంఖ్య 10,500, పతక విభాగాలు 302, క్రీడా వేదికలు 34, పాల్గొంటున్నదేశాలు 204. ఈ క్రీడల్లో భారత్ నుంచి 81 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పంచరింగుల క్రీడా పండుగకు లండన్ ఇప్పటికే రెండుసార్లు అతిధ్యమిచ్చింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting