ఫుట్‌బాల్ ఆడదాం రండి!

Posted By: Staff

ఫుట్‌బాల్ ఆడదాం రండి!

‘మీకు ఫుట్‌బాల్ అంటే ఇష్టమా.. అందులో గోల్‌కీపింగ్ అంటే మరీ ఇష్టమా.. ఈ విభాగంలో మీ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు గూగుల్ ఈ రోజు ఓ ఇంటరాక్టివ్ ఫుట్‌బాట్ డూడుల్‌తో నెటిజనులకు ముందుకు వచ్చింది ’

2012 లండన్ ఒలంపిక్స్‌ను పురస్కరించుకని గుగూల్ శుక్రవారం ఫుట్‌‌బాల్ ఇంటరాక్టివ్ డూడుల్‌ను తన హోమ్‌పేజీ పై పోస్ట్ చేసింది. ఈ ఇంటరాక్టివ్ డూడుల్ పై ఫుట్‌బాల్ ప్రియులు గోల్‌కీపర్‌లా వ్యవహరిస్తూ గేమింగ్ అనుభూతులను పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చు.

లండన్‌లో జరుగుతున్న 30వ ఒలింపిక్ క్రీడలు 17 రోజుల పాటు జరగనున్నాయి. పోటీలో జరిగే క్రీడాంశాల సంఖ్య 26, పాల్గొనున్న క్రీడాకారులు సంఖ్య 10,500, పతక విభాగాలు 302, క్రీడా వేదికలు 34, పాల్గొంటున్నదేశాలు 204. ఈ క్రీడల్లో భారత్ నుంచి 81 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పంచరింగుల క్రీడా పండుగకు లండన్ ఇప్పటికే రెండుసార్లు అతిధ్యమిచ్చింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot