దొంగ దొరికింది.. విమానంలో హైడ్రామా!

Posted By: Prashanth

దొంగ దొరికింది.. విమానంలో హైడ్రామా!

 

పొయిందనుకున్న ఆపిల్ ఐప్యాడ్ మళ్లి దొరికింది... ఫైండ్ మై ఐప్యాడ్ అనే ట్రాక్ అప్లికేషన్ పోలీసులకు సహాయపడగా... దొంగతనానికి పాల్పడిన ఆ విమాన సహాయకురాలి దొంగ బుద్ధి ఉద్యోగాన్ని ఊడగొట్టుకుంది. వివరాల్లోకి వెళితే..... అమెరికాలోని నెవెడా ప్రాంతానికి చెందిన వ్యక్తి, అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన హారిజాన్స్ విమానంలో తన ఆపిల్ ఐప్యాడ్‌ను పోగొట్టుకున్నాడు. అతని ఫిర్యాదు అందుకున్న పోలీసు అధికారులు విచారణ చేపట్టగా సదురు విమానంలో విధులు నిర్వహిస్తున్న 43ఏళ్ల వెండీ రోనెల్లీ డై దొంగతనానికి పాల్పడినట్లుగా రుజువైంది.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఫైండ్ మై ఐప్యాడ్ (Find My iPad)అనే అప్లికేషన్‌ను ఉపయోగించారు. ఈ అప్లికేషన్ ఆధారంగా దొంగిలించబడిన ఐప్యాడ్ సదరు విమాన సహాయకురాలి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా డై వెల్లడించిన సమాధానాలు అనుమానస్పదంగా ఉండటంచేత ఆమెను దోషిగా పరిగణించారు. నేరం రుజువుకావటంతో ఆలాస్క్ ఎయిర్ లైన్స్ యాజమాన్యం డైను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. శోధనలో భాగంగా అద్భుత పనితీరును ప్రదర్శించిన ‘ఫైండ్ మై ఐప్యాడ్’ అప్లికేషన్ మీ ఐప్యాడ్‌లో కావాలనుకుంటే వెంటనే ఆపిల్ ఐట్యూన్స్‌లోకి లాగినై డౌన్‌లోడింగ్ మొదలుపెట్టండి.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot