బిగ్ హిరోకే ఆ ఛాన్స్.. చెవులు కొరుక్కుంటున్నఇండస్ట్రీ వర్గాలు?

Posted By: Prashanth

బిగ్ హిరోకే ఆ ఛాన్స్.. చెవులు కొరుక్కుంటున్నఇండస్ట్రీ వర్గాలు?

 

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సరికొత్త విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టంను అక్టోబర్ 29న శాన్‌ఫ్రాన్సిస్కో‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఆహ్వాన పత్రాలు పలువురికి అందాయి. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో భాగంగా విశ్వసనీయ మొబైల్ బ్రాండ్ నోకియా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు బ్రాండ్ హిరోగా వ్యవహరించనుంది. ప్రముఖ డైలీ టెక్ పోర్టల్ స్లేష్‌గేర్  తన సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.... విండోస్ ఫోన్ 8 ఆవిష్కరణ ఆహ్వాన పత్రికలో పసుపు కలర్ వేరియంట్‌తో కూడిన నోకియా లూమియా 920 స్మార్ట్‌ఫోన్ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెచ్‌టీసీ, సామ్‌సంగ్ వంటి బ్రాండ్‌లు  విండోస్ ఫోన్ 8వోఎస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి మైక్రోసాఫ్ట్.. నోకియాకు ప్రాధాన్యతనివ్వటం పట్ల మార్కెట్ వర్గాలు వాడివేడిగా చర్చించుకుంటున్నాయి. లూమియా 920.. వైర్ లెస్ చార్జింగ్, గ్లవ్-ఫ్రెండ్లీ టచ్ స్ర్కీన్ వంటి అత్యాధునిక ఫీచర్లను ఒదిగి ఉంది.

లూమియా 920 ఫీచర్లు:

4.5 అంగుళాల కెపాసిటివ్  టచ్ స్ర్కీన్(రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ క్లియర్ బ్యాక్ డిస్ ప్లే టెక్నాలజీస్, 8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్  ప్రాసెసర్,  1జీబి ర్యామ్,  32జీబి ఇంటర్నల్ మెమెరీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot