ముసలివాళ్లను కుర్రవాళ్లుగా మార్చే డిజిటల్ కెమెరా

Posted By: Super

ముసలివాళ్లను కుర్రవాళ్లుగా మార్చే డిజిటల్ కెమెరా

సాధారణంగా ఫోటో షూట్ అంటే చాలు గంటల తరబడి అద్దాలు ముందు నిల్చుని మేకప్ వేసుకుంటుంటాం. అదే అమ్మాయిల విషయమైతే ఇక వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఇకపై ఇలా గంటల కొద్దీ సమయాన్ని, మేకప్ కోసం డబ్బును వృధా చేసుకోనవసరం లేదు. ఎందుకంటే.. జపాన్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఓ సరికొత్త కెమరాను రూపొందించారు. మేకప్ లేని ముఖాలకు సైతం డిజిల్ మెరుపులద్ది ఎంతో అందంగా కనిపించేటట్లు చేయడం ఈ కెమెరా ప్రత్యేకత.

పానసోనిక్ లుమిక్స్ డిఎమ్‌సి-ఎఫ్ఎక్స్77 అనే ఈ కెమెరా "బ్యూటీ రీటచ్" మోడ్‌తో లభిస్తుంది. ఫోటోలు తీసేటప్పుడు ఈ మోడ్‌ను ఎంపిక చేస్తేచాలు.. గార పట్టి పచ్చగా ఉండే పళ్లను సైతం ఇది హ్యాపీడెంట్ దంతాల్లా తెల్లగా మార్చేస్తుంది. అంతేకాకుండా.. ముఖంపై ఉండే ముడతలును కూడా ఇది మాయం చేసి కొత్త కాంతిని తెస్తుందట. 16 మెగా పిక్సెల్, 3.5 అంగుళాల టచ్‌స్క్రీన్, ఎల్‌సీడీ డిస్‌ప్లేని కలిగి ఉండే ఈ కెమెరాలో ఫేస్ ఫిక్సింగ్ ఆప్షన్ ఉపయోగించి విభిన్న కోణాల్లో ఫోటోలు తీసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot