WWDC 2022: M2 ప్రాసెసర్‌లతో రెండు మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లు లాంచ్ అయ్యాయి!! ధరలు, ఫీచర్స్

|

ఆపిల్ టెక్ సంస్థ యొక్క WWDC 2022 ఈవెంట్లో తన యొక్క తాజా చిప్‌సెట్‌ M2 ను ఆవిష్కరించింది. దానితో పాటుగా కంపెనీ మ్యాక్‌బుక్ ఎయిర్ (2022), మరియు 13-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో (2022) వంటి రెండు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. WWDC 2020లో ప్రకటించిన మొదటి జెనరేషన్ ఆపిల్ సిలికాన్ చిప్‌ యొక్క అప్ డేట్ వెర్షన్ తో సరికొత్త మోడల్‌లు అమర్చబడ్డాయి. మ్యాక్‌బుక్ ఎయిర్ M1 పవర్‌ నవంబర్ 2020లో ప్రారంభమైనప్పటి నుండి మ్యాక్‌బుక్ ఎయిర్ కంపెనీ యొక్క మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్‌లో మొదటి రిఫ్రెష్ ఇదే కావడం విశేషం. కొత్తగా విడుదలైన మ్యాక్‌బుక్ ఎయిర్ (2022) మరియు మ్యాక్‌బుక్ ప్రో (2022) రెండూ కూడా 13-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మ్యాక్‌బుక్ ఎయిర్ (2022) రెండు మోడల్‌ల ధరల వివరాలు

మ్యాక్‌బుక్ ఎయిర్ (2022) రెండు మోడల్‌ల ధరల వివరాలు

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (2022) 13-ఇంచ్ మోడల్ $1,199 ధర వద్ద లాంచ్ అయింది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ దాదాపు రూ. 93,300. అలాగే 13-అంగుళాల ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రో (2022) మోడల్ యొక్క ధర $1,299. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ దాదాపు రూ.1,01,000 నుండి ప్రారంభమవుతుంది. M1 చిప్‌తో కూడిన పాత మ్యాక్‌బుక్ ఎయిర్ $999 (సుమారు రూ.77,500) ధర వద్ద ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్లు యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ మరియు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా అన్ని రకాల కాన్ఫిగరేషన్ ఎంపికలలో ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. భారతదేశంలో కొత్త మ్యాక్‌బుక్ మోడల్‌లు వచ్చే నెల నుండి అందుబాటులో ఉంటాయి. M2తో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్ రూ.1,19,900 ధర వద్ద నుంచి మరియు M2తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో రూ.1,29,900 ధర వద్ద నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (2022) స్పెసిఫికేషన్స్
 

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (2022) స్పెసిఫికేషన్స్

ఆపిల్ సంస్థ కొత్తగా ప్రకటించిన మ్యాక్‌బుక్ ఎయిర్ (2022) యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది M2 చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంటుంది. 20 బిలియన్ ట్రాన్సిస్టర్‌లు మరియు 10-కోర్ GPUతో పాటుగా మొదటి తరం M1 ఆపిల్ సిలికాన్ చిప్ యొక్క అప్ గ్రేడ్ వెర్షన్ గా ఇది లభిస్తుంది. ఈ కొత్త చిప్‌సెట్ దాని మునుపటి తరం కంటే 18 శాతం మెరుగైన CPU పనితీరును మరియు 35 శాతం GPU పనితీరును అందిస్తుందని కంపెనీ తెలిపింది. మార్కెట్ లో ఉన్న 10-కోర్ ప్రాసెసర్‌లతో పోలిస్తే ఇది 1.9 రెట్లు వేగంగా (CPU) మరియు 2.3 రెట్లు వేగంగా (GPU) ఉందని ఆపిల్ తెలిపింది. కొత్త చిప్‌సెట్ కొత్త సెక్యూర్ ఎన్‌క్లేవ్, మీడియా ఇంజిన్ మరియు న్యూరల్ ఇంజిన్‌తో పాటుగా గరిష్టంగా 6K రిజల్యూషన్‌ డిస్ప్లేతో లభిస్తుంది.

మ్యాక్‌బుక్

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (2022) 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లేతో అమర్చింది, 2021 MacBook Pro లైనప్‌లో ప్రదర్శించబడిన మినీ-LED మోడల్‌ల వలె కాకుండా. మాక్‌బుక్ ఎయిర్ (2020) మోడల్‌తో పోలిస్తే సన్నగా ఉండే బెజెల్స్‌తో డిస్‌ప్లే 13.6-అంగుళాల పెరిగిన డిస్‌ప్లే పరిమాణాన్ని అందిస్తుందని క్లెయిమ్ చేయబడింది. అంటే 2021లో లాంచ్ చేసిన మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌ల మాదిరిగానే మ్యాక్‌బుక్ ఎయిర్ (2022) కూడా ఒక నాచ్‌ని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ మోడల్ గరిష్టంగా 2TB SSD స్టోరేజ్ ను అందిస్తుంది. అలాగే ఈ ల్యాప్‌టాప్ 1080p కెమెరాను కలిగి ఉంది. అలాగే ఈ మోడల్‌లో రెండు USB టైప్-C/ థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు ఉన్నాయి మరియు MagSafe ఛార్జింగ్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌కు మద్దతుతో వస్తాయి. ఇది ఫుల్ ఛార్జ్‌తో వీడియోలను చూస్తున్నప్పుడు 18 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది అని పేర్కొన్నారు. అలాగే ఇది 67W USB టైప్-సి పవర్ ఫాస్ట్ చార్జర్ అడాప్టర్‌తో 30 నిమిషాల్లోనే 50 శాతం వరకు వేగంగా ఛార్జింగ్ చేయడానికి అనుమతిస్తుంది.

ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో (2022) స్పెసిఫికేషన్‌లు

ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో (2022) స్పెసిఫికేషన్‌లు

మ్యాక్‌బుక్ ఎయిర్ (2022) మాదిరిగానే కొత్త ల్యాప్‌టాప్ మ్యాక్‌బుక్ ప్రో (2022)లో కూడా కొత్త M2 చిప్‌సెట్ తో అమర్చబడి వస్తుంది. ఇందులో వినియోగదారులు గరిష్టంగా 2TB స్టోరేజ్ తో పాటు 24GB వరకు ఏకీకృత మెమరీ లభిస్తుంది. ఈ మ్యాక్‌బుక్ ప్రో (2022) మోడల్ 13-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది P3 కలర్ సపోర్ట్‌తో గరిష్టంగా 500 nits గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌ మీద 20-గంటల వరకు బ్యాటరీ లైఫ్ ని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
MacBook Air (2022) and MacBook Pro (2022) Two Laptops Launched With M2 Processors in WWDC 2022 Event: Price, Specifications and More.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X