మనిషి మెదడు లాగా పని చేసే మెషిన్స్ వచ్చే సమయం ఆసన్నమైంది...!

Posted By: Staff

మనిషి మెదడు లాగా పని చేసే మెషిన్స్ వచ్చే సమయం ఆసన్నమైంది...!

మెల్ బోర్న్: ఆపిల్ కంపెనీ కో - ఫౌండర్ స్టీవ్ వోన్జాయిక్ మాట్లాడుతూ రాబోయే కాలంలో ఏదో ఒకరోజు కంప్యూటర్స్ మనుషులను అధిగమించనున్నాయని తెలిపారు. అంతేకాకుండా మనుషులతో సమానంగా పని చేయడమే కాకుండా కుక్క పిల్లలను మనం ముద్దుగా ఎలా చూసుకుంటామో అదేవిధంగా మనుషులను మెషిన్స్ చూస్తాయని అన్నారు. ఈ విషయాన్ని స్టీవ్ వోన్జాయిక్ ఆస్ట్రేలియాలో జరిగినటువంటి బిజినెస్ సమ్మిట్‌లో ప్రస్తావించారు. అమెరికన్ కంప్యూటర్ ఇంజనీర్ అయినటువంటి స్టీవ్ వోన్జాయిక్, తన మిత్రులు స్టీవ్ జాబ్స్, రోనాల్డ్ వేయిన్‌తో కలిసి ఆపిల్ కంపెనీని నెలకొల్పడం జరిగింది.

1970లలో పర్సనల్ కంప్యూటర్ ప్రవేశపెట్టిన సమయంలో స్టీవ్ వోన్జాయిక్ తన అమూల్యమైన సేవలను అందించడం జరిగింది. ఇప్పటికే మేము మనుషులను సైతం కంట్రోల్ చేయగలిగేటటువంటి మెషిన్స్‌ని సృష్టించే ప్రయత్నంలో ఉన్నాం. నాకు తెలిసి కంప్యూటర్స్ ఎప్పుడైతే మనుషుల యొక్క మెదడుతో సమానం అవుతాయో అటువంటి తరుణంలో కంప్యూటర్స్ మనుషులను లీడ్ చేయడం ప్రారంభిస్తాయి. ప్రతిసారి మేము ఓ కొత్త టెక్నాలజీని కనిపెట్టి, అది జనాభాకి పరిచయం చేయడం జరుగుతుంది. ఆ సరిక్రొత్త టెక్నాలజితో మనం ఎలా పని చేయవచ్చు అనే విషయాలను తెలియజేయడమే కాకుండా తక్కువ ధరలోనే మీకు అందించడం జరుగుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting