గూగుల్ నుంచి కీలక ప్రకటన.... రెండు నెలల ముందుగానే మేడ్ బై గూగుల్ ఈవెంట్ 2024..!
టెక్ దిగ్గజం గూగుల్ మేడ్ బై గూగుల్ ఈవెంట్ తేదీని (Made by Google Event 2024) వెల్లడించింది. అయితే ప్రతి సంవత్సరం నిర్వహించే తేదీ కంటే సుమారుగా రెండు నెలల ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో సాధారణంగా గూగుల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 13వ తేదీన నిర్వహించనుంది. ఈ గూగుల్ ఈవెంట్‌లో కొత్త పిక్సల్ సిరీస్ సహా ఇతర ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ల గురించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
మేడ్ బై గూగుల్ 2024 ఈవెంట్.. గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియా మౌంటెన్‌వ్యూలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 13వ తేదీ 10:30 PM కు ప్రారంభం కానుంది. గూగుల్ పిక్సల్ 9 సిరీస్ సహా పిక్సల్ వాచ్ 3 ను ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ ఈవెంట్‌లో ఏయే గ్యాడ్జెట్‌లను లాంచ్ చేయనున్నారో గూగుల్ వెల్లడించకపోయనా.. గూగుల్ AI తో కూడిన గూగుల్ పిక్సల్ 9 సిరీస్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో గూగుల్ పిక్సల్ 9, పిక్సల్ 9 ప్రో మరియు పిక్సల్ 9 ప్రో XL ఉన్నాయి. దీంతోపాటు పిక్సల్ బడ్స్ ప్రో 2, పిక్సల్ వాచ్ 3 ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది.
ఈ మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక సంస్థలు AI పై ప్రయోగాలు చేస్తుండగా.. గూగుల్ మాత్రం AI రంగంలో ముందు వరసలో ఉంది. జెమిని పేరుతో సొంత AI చాట్‌బాట్‌ను కలిగి ఉంది.
దీంతోపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ను అనుభవాన్ని మెరుగుపరిచే ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. సెక్యూరిటీ ఫీచర్‌లు, పనితీరు మెరుగుపరిచేందుకు కావాల్సిన అప్‌గ్రేడ్‌లు, మరియు AI ఆధారిత ఫీచర్‌ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నెల ప్రారంభంలో ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న iOS 18 పై ప్రకటన చేసింది. iOS 18 అనేక ఫీచర్‌లను కలిగి ఉంటుంది. హోమ్ స్క్రీన్ ఐకాన్‌ల కలర్ మార్చడం, హోమ్ స్క్రీన్‌ను కస్టమైజ్ చేసుకోవడం, యాప్ ఐకాన్‌లను డార్క్ మోడ్‌లోకి మార్చుకోవడం వంటిని చేయవచ్చు.

దీంతోపాటు Lock an యాప్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఐఫోన్‌లోని డేటాను మరింత భద్రతనిస్తుంది. యాప్‌లను ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టవచ్చు. మరియు లాక్ చేయవచ్చు. ఈ OS ద్వారా మెసెజ్‌లను మీకు కావాల్సిన సమయానికి షెడ్యూల్ చేయవచ్చు. మరియు ఎమోజీలను ఉపయోగించవచ్చు. మెసెజ్‌ల్లో యానిమేషన్లను కూడా పంపవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications