మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ టీవీ లు కొనాలనుకుంటున్నారా ? ఇవి చూడండి.

By Maheswara
|

భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత చైనా వస్తువులపైన వ్యతిరేకత కారణంగా స్వదేశీ వస్తువులపైన ఎక్కువ మక్కువతో స్వదేశీ వస్తువుల కు డిమాండ్ పెరిగింది.స్మార్ట్ టీవీ లు కొనాలనుకునే వారు భారతదేశంలో తయారైన స్మార్ట్ టీవీల కోసం చూస్తున్నారా? స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే, స్మార్ట్ టీవీల విషయానికి వస్తే ఏది కొనాలో తెలియక తికమక పడుతుంటారు.ఇప్పుడు స్మార్ట్ టీవీలు వేర్వేరు ధరల లో అందుబాటులో ఉన్నాయి. 10,000 కంటే తక్కువగా కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి.

 స్మార్ట్ టీవీల

ఈ సరసమైన స్మార్ట్ టీవీలను అందించే సంస్థలలో షియోమి, టిసిఎల్ మరియు రియల్ మీ సంస్థ లు  ఉన్నాయి.శామ్‌సంగ్, వు టీవీ, ఫ్లిప్‌కార్ట్ మోటరోలా మరియు నోకియా-బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు మరియు మరిన్ని బ్రాండ్లు ఉన్నాయి. కానీ  మీరు భారతదేశంలో తయారు చేసిన స్మార్ట్ టీవీల కోసం చూస్తున్నట్లయితే, ఇండియా లో తయారయ్యే  షిన్కో, ఒనిడా, కోడాక్ మరియు థామ్సన్ వంటి బ్రాండ్ల జాబితా ఇక్కడ ఇస్తున్నాము వీటిని గమనించండి.

Shinco

Shinco

Shinco సంస్థ , వీడియోటెక్ ఇంటర్నేషనల్ ప్రారంభించిన నోయిడాకు చెందిన టీవీ బ్రాండ్. ఈ సంస్థ  24-అంగుళాల మరియు 65-అంగుళాల పరిధిలో స్మార్ట్ టీవీలను అందిస్తుంది. షిన్కో యొక్క స్మార్ట్ టీవీలు సరసమైన ధరలలో లభిస్తాయి , ధర రూ.5,400 నుండి ప్రారంభమై రూ.48,000 వరకు ఉన్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఈ కంపెనీ సదుపాయంలో షిన్కో తన టీవీలను తయారు చేస్తుంది. షింకో ఇటీవల 43 అంగుళాల 4 కె స్మార్ట్ టీవీని, 20,999 ధరతో విడుదల చేసింది.

super plastronics

super plastronics

మీరు సూపర్ ప్లాస్ట్రోనిక్స్ గురించి విని ఉండకపోవచ్చు. కానీ ఇది నోయిడాకు చెందిన సంస్థ, 30 సంవత్సరాలుగా తమ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ సంస్థ భారతదేశంలోని కోడాక్ మరియు థామ్సన్ టీవీలకు బ్రాండ్ లైసెన్సుదారు గా ఉంది .సూపర్ ప్లాస్ట్రోనిక్స్ కు  భారతదేశంలో మూడు ఉత్పాదక కర్మాగారాలు  నోయిడా, ఉనా మరియు జమ్మూలో ఉన్నాయి.

కోడాక్ మరియు థామ్సన్ ఇటీవల ఓత్ ప్రో సిరీస్‌ను ప్రారంభించారు, దీని ధర ₹ 24,999 నుండి మొదలవు తుంది , ఇవి  మూడు పరిమాణాలలో లభిస్తాయి వరుసగా  43-అంగుళాలు, 55-అంగుళాలు మరియు 65-అంగుళాలు. ఈ స్మార్ట్ టీవీలు అల్ట్రా-హెచ్‌డీ స్క్రీన్లు, హెచ్‌డిఆర్ సపోర్ట్ మరియు డాల్బీ విజన్ ఫార్మాట్‌తో వస్తాయి.

ONIDA

ONIDA

టీవీలను తయారు చేసే  సంస్థ లలో  భారతదేశంలోని పురాతన సంస్థలలో ఒనిడా ఒకటి. ఈ సంస్థ 1981 లో ముంబైలో ప్రారంభించబడింది మరియు ఇది ఇప్పటికీ స్మార్ట్ టీవీలను తయారు చేస్తోంది. 43 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ఎల్‌ఇడి స్మార్ట్ టివి ధర ₹ 22,999. ఒనిడా భారతదేశంలో మొట్టమొదటి అమెజాన్ ఫైర్ టివి ఎడిషన్లను కూడా ప్రారంభించింది. మొదటి ఒనిడా ఫైర్ టీవీని 2019 డిసెంబర్‌లో ప్రారంభించారు.

videocon

videocon

వీడియోకాన్ మరొక పాత స్వదేశీ సంస్థ, ఇది 1985 లో ఔరంగాబాద్ ‌లో నందలాల్ మాధవ్లాల్ ధూత్ చేత ప్రారంభించబడింది. వీడియోకాన్ 24-అంగుళాలు మరియు 98-అంగుళాల డిస్ప్లేల నుండి 100 కి పైగా టీవీ మోడళ్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీలు AI- ఆధారిత లక్షణాలు, UHD రిజల్యూషన్, వైర్‌లెస్ డిస్ప్లే కనెక్టివిటీ మరియు విద్యుత్ పొదుపు లక్షణాలను అందిస్తున్నాయి.

panasonic

panasonic

పానాసోనిక్ ఒక జపనీస్ బ్రాండ్, కానీ భారత మార్కెట్లో,బలమైన మార్కెట్  కలిగి ఉంది. పానాసోనిక్ AVC ఇండియా 1996 లో CRT TV లు మరియు LCD ల తయారీకి స్థాపించబడింది.  పానాసోనిక్ నుండి ధర రూ. 15,000  నుండి వివిధ ధరలలో  స్మార్ట్ LED టీవీలు అందుబాటు లో ఉన్నాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Made in India Smart tvs, Shinco to Onida Here is the list and Price details.  

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X