చైనా కంపెనీకి దిమ్మతిరిగింది, ఆ యాప్ బ్యాన్ చేయమంటూ హైకోర్టు ఆదేశాలు

నేటి యువత ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు ఆన్‌లైన్‌లోనే ఉండిపోతుంది. డబ్‌శ్మాష్‌లు, సెల్ఫీ వీడియోలు, పబ్‌జీ గేమ్‌లతోనే సగం జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇప్పటికే పబ్‌జీ గేమ్ సమాజానికి హానికరంగా మా

|

నేటి యువత ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు ఆన్‌లైన్‌లోనే ఉండిపోతుంది. డబ్‌శ్మాష్‌లు, సెల్ఫీ వీడియోలు, పబ్‌జీ గేమ్‌లతోనే సగం జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇప్పటికే పబ్‌జీ గేమ్ సమాజానికి హానికరంగా మారిపోయి ఉంటే మరోవైపు టిక్ టాక్ యాప్ రోజురోజుకీ తలనొప్పిగా మారుతోంది. టిక్ టాక్ మాయలోపడి యువత టైమ్ వేస్ట్ చేస్తుందనే ఆందోళన మొదలైంది. టిక్ టాక్ యాప్‌కు బానిసలై పిచ్చి, పిచ్చి వీడియోలతో పిల్లలు, యువత పెడదారి పడుతుంటే గృహినులు కూడా ఈ టిక్‌టాక్‌కు బానిసలుగా మారిపోయారు.

చైనా కంపెనీకి దిమ్మతిరిగింది, ఆ యాప్ బ్యాన్ చేయమంటూ హైకోర్టు ఆదేశాలు

ఈ క్రమంలో టిక్ టాక్ దూకుడుకు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ బ్రేకులు వేసింది. తమిళనాడులో టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ ఎస్.‌ఎస్ సుందరం

జస్టిస్ ఎస్.‌ఎస్ సుందరం

టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్‌పై మధురై బెంచ్ విచారణ జరిపింది. తమిళనాడులో చిన్నారులు టిక్ టాక్ యాప్‌కు బానిసలుగా మారుతున్నారని.. ఈ యాప్ పిల్లల ఆలోచనా విధానం, మానసిక స్థితిపై ప్రభావంతో చూపుతోందని అభిప్రాయపడింది. డివిజన్ బెంచ్‌లో ఉన్న జస్టిస్ ఎస్.‌ఎస్ సుందరం మీడియా సంస్థలకు కూడా కొన్ని సూచనలు చేశారు.

భవిష్యత్ నాశనం

భవిష్యత్ నాశనం

టిక్ టాక్ వీడియోలను ప్రసారం చేయొద్దని జస్టిస్ సుందరం మీడియా సంస్థలకు సూచించారు. ఆన్‌లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్‌ తీసుకొచ్చే అంశంపై స్పందించాలని కేంద్రాన్ని కోరారు. యువత, పిల్లలు ఈ టిక్ టాక్ యాప్‌కు బానిసలుగా మారుతున్నారని అభిప్రాయపడ్డారు. వారి భవిష్యత్ నాశనం అవుతుందని.. అందుకే ఈ నిర్ణయమంటున్నారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.

వివాదాస్పద కామెంట్లు చేస్తూ

వివాదాస్పద కామెంట్లు చేస్తూ

ఫిబ్రవరిలో టిక్ టాక్‌పై నిషేధం విధించాలని తమిళనాడు ఐటీ మంత్రి కేంద్రాన్ని కోరారు. యాప్‌‌ను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అసెంబ్లీలో తెలిపారు. హింసను ప్రేరేపించే సంభాషణలు యాప్‌లో ఉన్నాయని.. రాజకీయ నేతలకు సంబంధించిన ప్రసంగాలను పోస్టు చేస్తున్నారని గుర్తు చేశారు. వివాదాస్పద కామెంట్లు చేస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారంటోంది తమిళనాడు సర్కార్.

 టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని..

టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని..

ఇది వరకే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టిక్ టాక్ యాప్ ను బ్లూవేల్ యాప్ తో పోలుస్తూ తమిళనాడు మంత్రి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న యాప్ గా అసెంబ్లీ వేదికగా అభివర్ణించారు.

 తమిళనాడు అసెంబ్లీలో ..

తమిళనాడు అసెంబ్లీలో ..

దేశం మొత్తం ఆడియోలు, వీడియోలతో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్ ఏ మాత్రం శ్రేయస్కరం కాదని తమిళనాడు అసెంబ్లీలో దీనిపై పెద్ద చర్చ జరిగింది. ఈ యాప్ ను బ్యాన్ చేయాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు ఐ టి మినిస్టర్ ఎం మణికందన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు

దుర్వినియోగం

దుర్వినియోగం

టిక్ టాక్ యాప్ చాలా సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతోంది. ఇటీవల కాలంలో ఒక కలెక్టర్ కు సంబంధించిన ఫోటోలను ఆమె అనుమతి లేకుండా టిక్ టాక్ లో వీడియో గా తయారు చేసి పోస్ట్ చేసి దానిని వైరల్ చేసారు .

పర్సనల్ ఫోటోలను

పర్సనల్ ఫోటోలను

తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్ రోహిణి పర్సనల్ ఫోటోలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సినిమా పాటలతో యాడ్ చేసి టిక్ టాక్ యాప్ లో పోస్టు చేశారు. ఆమెతోపాటు ఆమె కుమారుడి ఫోటోలను కూడా వివిధ రకాల సోషల్ మీడియా నెట్ వర్క్ లలో షేర్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ రోహిణి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోహిణి ఫోటోలతో ఉన్న టిక్‌టాక్‌ మ్యూజిక్‌ను నిషేధించే పనిలో సైబర్‌క్రైం పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రతి చోట ఇలాంటి తలనొప్పులు ఎదురవుతున్నప్పటికీ ఈ యాప్ విషయంలో ఏ రాష్ట్రము ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు.

 

ఆసియా లో 500 మిలియన్ల వినియోగదారులు

ఆసియా లో 500 మిలియన్ల వినియోగదారులు

బైట్ డాన్స్ అనే చైనీస్ ఐటీ కంపెనీ తయారుచేసిన ఈ యాప్ చాలా పాపులారిటీ సంపాదించింది. ఆసియా లో 500 మిలియన్ల వినియోగదారులు ఈ యాప్ కు ఉన్నారు. ఈ యాప్ ద్వారా సినిమాలకు సంబంధించిన పాటలు, సీన్లు, డైలాగులు వినియోగదారులు అందులో ఉన్న వివిధ ఫిల్టర్ల ద్వారా రికార్డ్ చేస్తూ పబ్లిక్ కి షేర్ చేస్తున్నారు. యువత ఈ యాప్ పట్ల చాలా క్రేజ్ తో ఉంది.

Best Mobiles in India

English summary
madras high court directs centre to ban downloading of tiktok app

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X