ఈ రోజు గూగుల్ డూడుల్స్‌లో పెట్టిన మేజిషియన్ హ్యారీ హుడిని విశిష్టత..

Posted By: Staff

ఈ రోజు గూగుల్ డూడుల్స్‌లో పెట్టిన మేజిషియన్ హ్యారీ హుడిని విశిష్టత..

మెల్‌బోర్న్: గూగుల్ సందర్బాన్ని బట్టి గూగుల్ డూడుల్స్‌ని పెడుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ప్రత్యేకంగా హాంగేరిలో జన్మించినటువంటి అమెరికా మేజిషియన్ హ్యారీ హుడిని 137వ జన్మదినాన్ని పురస్కరించుకోని ఆయన డూడుల్‌ని పెట్టడం జరిగింది. గూగుల్ అనే ఇంగ్లీషు అక్షరాలను పెయింట్‌ రాసి అతని ఫోటోకి వెనుక భాగాన పెట్టినటువంటి డూడుల్ అయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈయన జన్మదినాన్ని పురస్కరించుకోని ఆయన అభిమానులను సంతృప్తి పరచడం కోసమే ఇలా చేశామని అన్నారు.

ఇక గూగుల్ డూడుల్‌ని గనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే అతని చేతులకు విరిగినటువంటి చైన్స్‌ని గమనించవచ్చు. దీనికి అర్దం ఏమిటంటే ఎటువంటి క్లిష్ట పరిస్ధితులను అయినా తన చాకచక్యంతో తెలివిగా మాయలను ఉపయోగించి తప్పించుకోగలరు అనేదానికి నిదర్శనం అన్నారు. ఇక హ్యారీ హుడిని 1874వ సంతవత్సరంలో మార్చి 24వ తారీఖున హాంగేరిలోని బుధాపెస్ట్‌లో జన్మించారు. మొట్ట మొదట హ్యారీ హుడిని కి పెట్టిన పేరు ఈరిచ్ వైజ్.

చిన్నతనంలో హ్యారీ హుడిని న్యూయార్క్ చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన 17సంవత్సరాల వయసు నుండే న్యూయార్క్ మ్యూజిక్ హాల్స్, స్టేజి షోలలో మేజిషియన్‌గా తన ప్రస్దానాన్ని మొదలుపెట్టారు. హ్యారీ హుడిని చేసేటటువంటి విన్యాసాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మిర్రర్ హ్యాండ్ ఖర్చిప్ ఛాలెంజ్, మిల్క్ వ్యాన్ నుంచి తప్పించుకోవడం, చైనీస్ వాటర్ సెల్, బాక్స్ నుండి తప్పించుకోవడం లాంటి విన్యాసాలకు హ్యారీ హుడిని పెట్టింది పేరు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot