Phonepe ప్రత్యేక ఆఫర్.. రూ.1 ట్రాన్సాక్షన్ చేసినా రూ.144 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు..!
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో మహా కుంభమేళా (Maha Kumb Mela 2025) ఘనంగా జరుగుతోంది. జనవరి 13 నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఈ నెల 29 వ తేదీన భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారనే సమాచారంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సహా ఇతర ప్రముఖుల పర్యటనలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. ఇప్పటికే అనేక సంస్థలు అక్కడ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ కూడా తాత్కాలికంగా స్టోర్ ను ఏర్పాటు చేసింది.
ఫోన్‌పే సూపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ :
ప్రముఖ UPI చెల్లింపుల సంస్థ Phonepe మహా కుంభమేళాకు హాజరయ్యే భక్తుల కోసం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ను ప్రకటన చేసింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 26 వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఫోన్‌పే వెల్లడించింది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ ను ఎలా పొందాలి, రూల్స్ ఏంటి..? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఒక్క రూపాయి పంపినా రూ.144 క్యాష్‌బ్యాక్ :
యూపీలో జరుగుతున్న భక్తుల కోసం ఫోన్‌పే ఆఫర్‌ను (Phonepe Maha kumbmela cashback) లాంచ్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా తొలిసారి ఫోన్‌పే వినియోగిస్తున్నవారు తమ తొలి ట్రాన్సాక్షన్‌పై రూ.144 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఒక్క రూపాయి పంపినా ఈ మొత్తాన్ని పొందవచ్చని తెలిపింది. ప్రయాగ్‌రాజ్ నగరంలోనే ఈ ఆఫర్ వర్తించనుంది.
వీరికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది :
ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళాలో పాల్గొనే భక్తులు, ఇతరులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ స్క్రాచ్ కార్డుల రూపంలో పొందుతుందని తెలిపింది. అయితే ఫోన్‌పే నుంచి తొలి ట్రాన్సాక్షన్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. ఇప్పటికే ఫోన్‌పే రూ.99 కంటే తక్కువ ధరకే ప్రయాణ బీమాను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫోన్‌పేను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి :
ఫోన్‌పే యాప్‌ను ఆండ్రాయిడ్, iOS స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం మీ బ్యాంకు అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి. ఇందుకు మీ రిజిస్టర్ ఫోన్ నంబర్‌ను ఉపయోగించాలి. ఆ తర్వాత UPI పిన్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫోన్‌పే యాప్ అడిగిన అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.
బ్లింకిట్ స్టోర్ ఏర్పాటు :
మహా కుంభమేళాలో పాల్గొనే భక్తుల కోసం బ్లింకిట్ స్టోర్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక్కడ ఫోన్ ఛార్జర్‌లు, పవర్‌బ్యాంక్‌లు, బెడ్‌షీట్, దుప్పట్లు సహా పాలు, పెరుగు, పండ్లు, కూరగాయాలు సహా పూజాసామాగ్రి, త్రివేతి సంగమం గంగా జలం బాటిళ్లను విక్రయిస్తోంది.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన యూపీ సర్కార్ :
దీంతోపాటు మహాకుంభమేళా కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. భారీ స్థాయిలో భద్రతా ఏర్పాటు చేసింది. రాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ సహా అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచింది. మరియు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను అమర్చింది. కోట్లాది మంది భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాటు చేసింది.
నీటి అడుగున పనిచేసే డ్రోన్‌లు :
ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు, నీటి అడుగున పనిచేసే డ్రోన్‌లు, రోబోటిక్స్ బోయ్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. దీంతోపాటు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, RFID రెడ్‌బ్యాండ్స్, ఫేస్ లెవల్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వీటితోపాటు గూగుల్ ఏఐ ఆధారిత మ్యాప్స్ ద్వారా వెహికల్ పార్కింగ్, నేవిగేషన్ కు సాయం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








