Home
News

ఫేస్‌బుక్‌ యాడ్‌ చూసి.. అంతా నిజమని నమ్మి.. రూ.27 లక్షలు కోల్పోయిన మహిళ..!

సైబర్‌ నేరాలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. సోషల్‌ మీడియా సహా ఇతర వేదికల్లో అమాయకులను టార్గెట్‌ చేసి మోసం చేస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. కొందరైతే ఏకంగా లక్షల్లో నగదును కోల్పోతున్నాయి.

తాజాగా ఇటువంటి ఘటనలో మరొకటి వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన 33 సంవత్సరాల మహిళ ఓ రోజు ఫేస్‌బుక్‌లో బిట్‌కాయిన్‌కు సంబంధించిన ప్రకటనను చూసింది. దానిపై ఆసక్తి కనబరిచి అందులో ఇచ్చిన లింక్‌పైన క్లిక్‌ చేసింది. అందులోని వివరాలు నిజమని నమ్మింది.

woman losts rs27 lakh in fake bitcoin scam

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని ఆ ఫేస్‌ యాడ్‌లో ఉంది. బిట్‌కాయిన్‌లో కేవలం $500 డాలర్ల ( భారత కరెన్సీలో సుమారుగా రూ.42 వేలు) పెట్టుబడి పెట్టడం ద్వారా కచ్చితమైన లాభాలు పొందవచ్చని యాడ్‌లో ప్రచురించారు. $4800 డాలర్ల వరకు సంపాదించవచ్చని అందులో పేర్కొన్నారు. ఇదంతా నిజమని నమ్మిన సదరు మహిళ అక్కడున్న ఓ ఫోన్‌ నంబర్‌ను చూసి సదరు వ్యక్తిని సంప్రదించింది.

ఫోన్‌లో తనను బెల్జియన్‌ పౌరుడిగా చెప్పిన వ్యక్తి మహిళ ఆసక్తిచూపడంతో ఆమెను మోసం చేసేందుకు ప్లాన్‌ చేశారు. దీంతో తక్కువ మొత్తం పెట్టుబడితో ఎక్కువ లాభాలను సంపాదించవచ్చునని మభ్యపెట్టారు. తాము చెప్పిన ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని చెప్పారు. అనంతరం అందులో ఓ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేయాలని సూచించారు.

woman losts rs27 lakh in fake bitcoin scam

మహారాష్ట్ర మహిళను తమ బృందంలో చేర్చుకున్నట్లు తెలిపే ఓ స్క్రీన్‌షాట్‌ను ఆమెకు పంపించారు. దీంతో ఇదంతా నిజమే అని నమ్మిన సదరు మహిళ.. తొలుత బిట్‌కాయిన్‌లో రూ.50000 పెట్టుబడి పెట్టింది. దీంతో ఆమె లాభాలు సంపాదించి అనే నమ్మించే విధంగా ఓ వెబ్‌సైట్‌ను చూపించారు. ఆమె అప్పటివరకు $4586 లాభాలు పొందినట్లు అందులో చూపించారు.

సులువుగా డబ్బు సంపాదించే అవకాశం ఉండడంతో అలా పెట్టుబడి పెడుతూనే ఉంది. అలా రూ.27 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. చివరగా వచ్చిన లాభాలతో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకొనేందుకు వీలుగా ఓ లింక్‌ను ఆమెకు పంపించారు. అయితే ఆ లింక్ ద్వారా నగదును విత్‌డ్రా చేయలేకపోయింది. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే అయోధ్య రామమందిరం విరాళాల పేరుతో నకిలీ క్యూఆర్‌ (QR Code) కోడ్‌లతో సోషల్‌ మీడియా ద్వారా విరాళాలు సేకరిస్తున్న సైబర్‌ నేరగాళ్లపై విశ్వ హిందూ పరిషత్‌తోపాటు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విరాళాల ఇచ్చేందుకు అధికారిక వెబ్‌సైట్‌ మాత్రమే వినియోగించాలని సూచించారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Maharastra woman losts rs27 lakh in fake bitcoin scam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X