ప్రిన్స్ మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా రాష్ట్రంలో ఐడియా 3జీ సేవలు

Posted By: Staff

ప్రిన్స్ మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా రాష్ట్రంలో ఐడియా 3జీ సేవలు

రాష్ట్రంలో 3జీ సేవలకు ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఐడియా సెల్యులార్‌ శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రచారకర్తగా సినీ హీరో మహేశ్‌బాబును నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా 14 ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభిస్తున్నామని, 2012 మార్చి నాటికి 200 పట్టణాలకు విస్తరిస్తామని ఐడియా సెల్యులార్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంబరీష్‌ పి.జైన్‌ మంగళవారం ఇక్కడ చెప్పారు. ఈ ఏడాది మార్చి 28న 3జీ సేవలను 10 పట్టణాలతో ప్రారంభించామని, మే 31 నాటికి 750 పట్టణాలు, 2012 మార్చి 31కి 3700 పట్టణాలకు ఈ సేవలు విస్తరించాలన్నది ప్రణాళికగా ఆయన చెప్పారు.

3జీ సేవలను కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ (పశ్చిమ-తూర్పు), పంజాబ్‌, హర్యానా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాల్లోనూ అందిస్తామన్నారు. దేశంలో మూడో అతిపెద్ద మొబైల్‌ ఆపరేటర్‌గా ఉన్న తమకు దాదాపు 9 కోట్ల మంది వినియోగదారులున్నారని, రోజుకు 100 కోట్ల నిమిషాల వినియోగంతో ప్రపంచంలోని అగ్రశ్రేణి 10 కంపెనీల్లో ఒకటిగా స్థానం పొందామని తెలిపారు. దేశీయంగా పరిశ్రమ మొత్తం ఆదాయంలో 13.3% వాటా తమదని జైన్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 82 లక్షల మందికి చేరువయ్యామని ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సుబ్బరామన్‌ అయ్యర్‌ చెప్పారు. ఈ నెలాఖరులోపు 50 పట్టణాలకు 3జీ సేవలు విస్తరిస్తామని తెలిపారు.

ఇవీ ప్రత్యేకతలు: వీడియో కాలింగ్‌కు సెకనుకు 2 పైసలు ఛార్జీగా వసూలు చేస్తారు. ఈ నెల 30 వరకు టీవీ, వీడియో కాన్ఫరింగ్‌ వంటి అప్లికేషన్‌లు ఉచితం. నెట్‌ వేగం 21.1 ఎంబీపీఎస్‌ వేగం వరకు లభించే 3జీ సేవల కోసం రూ.8 (10 ఎంబీ), రూ.46 (30 నిమిషాలు) వంటి రోజువారీ వినియోగ పథకాలు ఉన్నాయి. రూ.750 కి 2జీబీ వరకు వినియోగించుకోవచ్చు. ఇవికాక కంప్యూటర్లపై పనిచేసుకునేందుకు 21.1 ఎంబీపీఎస్‌ డేటాకార్డులనూ ఐడియా విడుదల చేసింది. 3జీ సేవల కోసం act 3g అని టోల్‌ ఫ్రీ నెంబరు 12345 కు ఎస్‌ఎంఎస్‌ పంపితే సరిపోతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot