'వికస్టమర్ బీపీవో'ని కొనుగోలు చేసిన మహీంద్రా సత్యం

Posted By: Staff

'వికస్టమర్ బీపీవో'ని కొనుగోలు చేసిన మహీంద్రా సత్యం

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఐటీసేవల సంస్ద మహీంద్రా సత్యం... ఇటీవలే అమెరికాకు చెందిన 'వికస్టమర్' అనే బీపీవో కంపెనీని కొనుగోలు చేసింది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న 'వికస్టమర్ కార్పోరేషన్' లో మొత్తం 100 శాతం వాటను సుమారు రూ 135 కోట్లలతో సొంతం చేసుకుంది. మహింద్రా గ్రూప్ సంస్దగా మారిన మహీంద్రా సత్యం మొట్టమొదటి సారి కొనుగోలు చేసిన కంపెనీ వికస్టమర్ కావడం విశేషం.

ఆర్దిక మాంద్యం నుండి తేరుకున్న తర్వాత మహీంద్రా సత్యం 'వికస్టమర్' కొనుగోలుని ఒక మైలురాయిగా కంపెనీ సీఈవో సిపి గుర్నాని తెలిపారు. వివిధ భాగాల్లో మహీంద్రా సత్యం మరింత ముందుకు దూసుకుపోయేందుకు, ప్రపంచ వ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింతగా అభివృద్ది చేసుకునేందుకు గాను వికస్టమర్ సరపోతుందనే ఉద్దేశ్యంతో దీనిని కొనుగోలు చేశామని అన్నారు. వికస్టమర్‌తో కలసి బీపీవో రంగంలో కొత్త ఒరవడిని సృష్టించేందుకు సిద్దంగా ఉన్నట్లు బీపీవో సుజిత్ బక్షీ పేర్కోన్నారు.

వికస్టమర్ కొనుగోలుతో మహీంద్రా సత్యం బీపీవో కార్యకలాపాలకు రిటైల్, కస్టమర్ టెక్నాలజీ విభాగాలు దోహాదపడడమే కాకుండా.... సాంకేతిక మద్దతు పెరుగుతుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న కొత్త మార్కెట్ల సేవల విస్తరణకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot