కెనడాలో మహీంద్ర సత్యం రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్..

Posted By: Super

కెనడాలో మహీంద్ర సత్యం రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్..

చైనా మార్కెట్లో వృద్ధి చెందేందుకు అక్కడి స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకొనే దిశగా మహీంద్రా సత్యం అడుగులు వేస్తోంది. అవకాశం ఉంటే అక్కడి కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్త వృద్ధి వ్యూహంలో భాగంగా మహీంద్రా సత్యం పలు చైనీస్ వెంచర్ భాగస్వాములను వెతుకుతోందని ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్(ఆసియా పసిఫిక్, ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా రీజియన్స్) రోహిత్ గాంధీ సోమవారం సింగపూర్‌లో చెప్పారు.

కొనుగోలుకు మధ్యస్థాయి కంపెనీలు అనుకూలంగా ఉంటాయన్నారు. ఇందుకు సంబంధించిన స్పష్టమైన వివరాలను మాత్రం వెల్లడించలేదు. దక్షిణాఫ్రికా, కతర్, సౌదీ అరేబియాల్లో విపరీతమైన వృద్ధి అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. మహీంద్రా సత్యంకు ప్రస్తుతం చైనాలో 500 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 90% స్థానికులే.

కెనడాలోని ఒంటారియోలో గల యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ క్యాంపస్‌లో తొలి స్మార్ట్ గ్రిడ్ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్(ఆర్‌ఐసీ)ని ఏర్పాటు చేసినట్లు మహీంద్రా సత్యం ప్రకటించింది. ఈ సెంటర్ విద్యార్థులు, అధ్యాపకులు, ఐటీ నిపుణులకు మలితరం స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ నవకల్పనల అభివృద్ధికి దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూతో కుదిరిన ఎంవోయూలో భాగంగానే ప్రస్తుత ఆర్‌ఐసీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot