ఫేక్ ఉద్యోగుల ఏరివేతను ప్రారంభించిన మహీంద్రా సత్యం

Posted By: Super

ఫేక్ ఉద్యోగుల ఏరివేతను ప్రారంభించిన మహీంద్రా సత్యం

ఫేక్ ఉద్యోగులారా.. పారాహుషార్..! అమెరికాలో మరోసారి తలెత్తిన ఆర్థిక మాంద్యపు భూకంపం దేశీయ కంపెనీలపై కూడా స్వల్పంగా ప్రభావాలను చూపుతోంది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన సత్యం కంప్యూపటర్స్‌ (ప్రస్తుతం మహీంద్రా సత్యం)ను స్వాధీనం చేసుకు మహీంద్రా గ్రూపు ఇప్పుడు ఫేక్ (నకిలీ) ఉద్యోగులను ఏరివేత కార్యక్రమాన్ని ప్రారంభించింది. నకిలీ ధృవీకరణ పత్రాల (ఫేక్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్)తో కంపెనీను మోసం చేసి ఉద్యోగాల్లో చేరిన వారిని తొలగించే ప్రక్రియకు ప్రముఖ ఐటీ రంగ సంస్థ మహీంద్రా సత్యం శ్రీకారం చుట్టింది.

భారత్‌లోని హైదరాబాద్‌, చెన్నయ్, బెంగళూరు కేంద్రాల్లో సుమారు 21,000 మంది ఉద్యోగులు నకిలీ సర్టిఫికేట్లతో విధుల్లోకి చేరారని, ప్రస్తుతం వీరికి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోందని, ఈ ప్రక్రియ సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తవుతుందని మహీంద్రా సత్యం ఛీఫ్ పీపుల్ ఆఫీసర్ (సీపీఓ) టి హరి తెలిపారు. వీరిలో ఎవరైనా ఉద్యోగులు కంపెనీ మోసం చేసినట్లు రుజువైతే వారిని విధుల్లోంచి తొలగించడమే కాకుండా, చీటింగ్‌ కేసును సైతం పెట్టనున్నామని హరి చెప్పారు.

అనుమానిత ఉద్యోగుల గురించి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన సంస్థల సహాయంతో వివరాలను సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరడాన్ని కంపెనీ చాలా సీరియస్‌గా తీసుకుందని, ఇప్పటికే ఇలా చేరి 7 గురు వ్యక్తులపై కేసులను ఫైల్ చేయడం జరిగిందని అలాగే, మరో డజను మంది ఉద్యోగులపై కేసు ఫైలింగ్ విధానం కొనసాగుతోందని హరి చెప్పారు. ఉద్యోగులు సమర్పించే వివిధ సంస్థల నుంచి తీసుకువచ్చిన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లపై (అనుభవ పత్రాలు) అనుమానం రావడం ద్వారా ఈ విషయాన్ని గుర్తించడం జరిగిందని ఆయన చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot