జియోను హడలెత్తిస్తున్న సమస్యలు ఇవే?

కొద్ది రోజుల వ్యవథిలోనే కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకున్న రిలయన్స్ జియోను అడుగడుగునా నెట్‌వర్క్ సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. జియో నెట్‌వర్క్ తొలి రోజుల్లో చాలా కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉండటంతో నెట్ వేగం ఉరకలెత్తించింది.

జియోను హడలెత్తిస్తున్న సమస్యలు ఇవే?

Read More : వాట్సాప్‌ను గూగుల్‌లా వాడుకోవటం ఎలా..?

దీంతో వేగవంతమైన ఇంటర్నెట్ డేటా యూసేజ్ లైఫ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆస్వాదించారు. సెప్టంబర్ 5 తరువాత జియో సిమ్ అందరికి అందుబాటులోకి రావటంతో సమస్యలు మొదలయ్యాయి. వాయిస్ కాల్స్ ఫెయిలవటం, ఇంటర్నెట్ వేగం మందగించటం, యాప్స్ పదేపదే క్రాష్ అవటం, బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోవటం వంటి అంశాలు జియో యూజర్లను ఇబ్బందిపెడుతూనే ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో వాయిస్ కాల్స్ ఎందుకు కనెక్ట్ అవటం లేదు..?

జియో ఉచిత కాల్స్ ఆఫర్ చేస్తున్నప్పటికి ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్స్ జియో యూజర్లకు ఇంటర్ కాల్ కనెక్టింగ్ పాయింట్లను కల్పించకపోవటంతో పాటు చాలా సందర్భాల్లో కాల్స్ ఫెయిల్ అవుతున్నాయి. చాలా సార్లు జియో నెంబర్ నుంచి కాల్ చేస్తున్నప్పుడు "All lines in this route are busy" అని వస్తోంది. చాలా సేపటి తరువాత లైన్ కలుస్తోంది. ఇంటర్ కనెక్టింగ్ పాయింట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లయితే ఈ సమస్య సద్దుమణిగే అవకాశం ఉంది.

ఇంటర్నెట్ వేగం మందగిస్తోంది..?

ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, ఆర్‌కామ్, రిలయన్స్ జియోకు చెందిన 4జీ డేటా సేవల వేగాన్ని టెలికం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల పరీక్షించి చూసింది. వీటిలో జియో డేటా సేవల వేగం మిగిలిన సంస్థల సేవల కంటే మెల్లగా ఉంది.

ఇంటర్నెట్ వేగం మందగిస్తోంది..?

ట్రాయ్ పరీక్షల్లో... మొదటి స్థానంలో నిలిచిన ఎయిర్‌టెల్ 4జీ వేగం సెకనుకు 11.4 మెగాబైట్స్ (ఎంబీపీఎస్) ఉంది. రెండో స్థానంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్‌కామ్ 4జీ సేవల వేగం 7.9 ఎంబీపీఎస్‌గా ఉంది. మూడో స్థానంలో నిలిచిన ఐడియా 4జీ వేగం 7.6 ఎంబీపీఎస్ గా ఉంది. నాలుగవ స్థానంలో వొడాఫోన్ 4జీ సేవల వేగం 7.3 ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు ట్రాయ్ గుర్తించింది. ఇక సంచనలం రేపిన జియో అన్నింటికంటే చివరిస్థానంలో నిలిచింది. జియో 4జీ డేటా సేవల వేగం సెకనుకు 6.2 ఎంబీపీఎస్‌గా ఉందని వెల్లడైంది. జియో దీని పై వర్క్ చేయవల్సి ఉంది.

యాప్స్ పదేపదే క్రాష్ అవుతున్నాయి..?

జియో ఆఫర్ చేస్తున్న యాప్స్ ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చటం లేదని పలువురు యూజర్లు వాపోతున్నారు. ముఖ్యంగా జియో టీవీ యాప్ పదేపదే క్రాష్ అవుతోందని వీరు చెబుతున్నారు. డేటా ఆన్ అయిన ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో జియో 4జీ వాయిస్ యాప్ ఆఫ్‌లైన్ అని చూపిస్తోందని పలువురు యూజర్లు అంటున్నారు.

బ్యాటరీ బ్యాకప్ వెంటనే తగ్గిపోతోంది

రిలయన్స్ తన జియో సేవలను 4జీ వేగంతో అందిస్తోంది. 2జీ, 3జీలతో పోలిస్తే 4జీ వేగం ఎక్కువగా ఉండటంతో ఫోన్ బ్యాటరీ బ్యాకప్ వేగంగా తగ్గిపోతోంది. దీంతో జియో యూజర్లు మాటిమాటికి ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేయవల్సిన పరిస్థితి వస్తోంది.జియో యాప్స్ ఎక్కువ బ్యాటరీని ఖర్చు చేస్తున్నాయి.

VOLTE సపోర్ట్ లేకపోవటంతో..?

జియో సిమ్‌ను వాడుతోన్న చాలా వరకు 4జీ స్మార్ట్‌ఫోన్‌లలో VOLTE సపోర్ట్ అందుబాటులో లేకపోవటంతో వాయిస్ కాల్స్‌ను Jio4gVoice యాప్ ద్వారా చేసుకోవల్సి వస్తోంది. ఈ యాప్ ఒక్కోసారి మెరాయించటంతో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. జియో ఈ అంశం పై దృష్టి సారించి నేరుగా కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తే బాగుంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Major Problems that Reliance Jio needs to fix. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting